ఉత్త‌రాఖండ్ సీఎం హ‌రీశ్‌రావ‌త్‌కు సీబీఐ స‌మ‌న్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉత్త‌రాఖండ్ సీఎం హ‌రీశ్‌రావ‌త్‌కు సీబీఐ స‌మ‌న్లు

కొన్ని నెల‌ల క్రితం ఉత్త‌రాఖండ్‌లో ఏర్ప‌డిన రాజ‌కీయ అనిశ్చితి నేప‌థ్యంలో ఉత్త‌రాఖండ్ ముఖ్యమంత్రి హ‌రీశ్‌రావ‌త్‌ కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల‌ను కొన‌డానికి ప్ర‌య‌త్నించార‌నే ఆరోప‌ణ‌ల‌పై సీబీఐ అధికారులు ప్రాథ‌మిక విచార‌ణ చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. హరీశ్‌ రావత్ ఎమ్మెల్యేలను ఆక‌ర్షించేందుకు చేసిన ప్ర‌య‌త్నాల‌ను ఆ రాష్ట్రంలోని ఓ ఛానల్ స్టింగ్ ఆపరేషన్ చేసి ఆడియో, వీడియో టేపులు బయటపెట్ట‌డంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో సీబీఐ దీనిపై విచారణ ప్రారంభించింది. ఈ రోజు హ‌రీశ్‌రావ‌త్‌కు సీబీఐ అధికారులు స‌మ‌న్లు జారీ చేశారు. ఈ కేసులో ఈ నెల 26 (సోమ‌వారం)న‌ విచార‌ణ‌కు హాజ‌రుకావాలని ఆదేశించారు.
harish rawat

More Telugu News