శుభతిథిగా అమావాస్య!
అమావాస్య అనే పేరు వినగానే చాలామందిలో ఒక రకమైన అలజడి మొదలవుతుంది. అమావాస్య అనేది చీకటికి సంబంధించినదై వుండటం అందుకు కారణం కావచ్చు. చీకటి నేపథ్యంలో జరిగే కొన్ని సంఘటనలు చిన్నప్పటి నుంచి వింటూరావడం కారణం కావచ్చు. ఏదేవైనా అమావాస్య అనే మాట ఎక్కడా వినిపించకూడనిదిగా వ్యవహరిస్తుంటారు.
ఇక శుభకార్యాలు ఏవి తలపెడుతున్నా ముందుగా అందరూ అమావాస్య ఎప్పుడైంది చూసుకుంటారు. ఆ రోజున గానీ .. అంతకు చాలా దగ్గరలోగానీ ... ఆ వెంటనేగాని ఆ కార్యక్రమాలు పెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వుంటారు. అంటే అంతా కూడా అమావాస్యను ఒక అశుభ తిథిగా భావిస్తుంటారు.
అయితే ఇదే అమావాస్యను శుభతిథిగా భావించేవారు లేకపోలేదు. తెలుగువారు పౌర్ణమి రోజును ఎంత పవిత్రమైనదిగా భావిస్తుంటారో, తమిళనాడు ప్రాంతానికి చెందిన ప్రజలు అమావాస్యను అంత పవిత్రమైనదిగా భావిస్తుంటారు. అమావాస్య రోజున ఆరంభించే శుభకార్యాల వలన సంపూర్ణమైన ఫలితం దక్కుతుందని వాళ్లు విశ్వసిస్తుంటారు.
సహజంగానే తమిళ ప్రాంత ప్రజలు పితృ దేవతలను ఎక్కువగా ఆరాధిస్తుంటారు. తాము తలపెట్టిన ప్రతి కార్యక్రమానికి పితృదేవతల ఆశీస్సులు అవసరమని భావిస్తుంటారు ... వారిని ఆహ్వానిస్తుంటారు. అమావాస్య పితృ దేవతలకి అనుకూలమైన తిథి కనుక, వాళ్లు దీనిని పూర్ణ తిథిగా ... శుభతిథిగా ఆచరించడం ఒక సంప్రదాయంగా వస్తోంది.