కార్తీకంలో ఉల్లి తినకూడదా?
కార్తీకమాసం పరమపవిత్రమైన మాసం. కాస్తంత ఓపికతో ... మరికాస్త భక్తి శ్రద్ధలతో నియమనిష్టలను పాటిస్తూ శివకేశవులను ఆరాధించాలే గాని, అనేక జన్మాల పాపాలను అవలీలగా తొలగించుకోవచ్చని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఉల్లిపాయను ఉపయోగించకుండా నిషేధించడం, కార్తీక మాసంలో పాటించే ప్రధానమైన నియమాలలో ఒకటిగా కనిపిస్తూ వుంటుంది.
సాధారణంగా ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని చెబుతుంటారు. అలాంటి ఉల్లిపాయను కార్తీక మాసంలో పూర్తిగా దూరం పెడుతుంటారు. ఈ నేపథ్యంలో చాలామందిలోను ఒక అపోహ వుంది. ఉల్లిపాయ శాకాహారం కిందికి రాదనీ, అందువల్లనే దానిని కార్తీక మాసంలో వాడకూడదని వాళ్లు భావిస్తుంటారు. అయితే ఈ కార్తీక మాసంలో ఉల్లిపాయ వాడకం మంచిది కాదని చెప్పడానికి ఆధ్యాత్మిక పరమైన కారణాలేవీ కనిపించవు.
ఆరోగ్య సంబంధమైన కారణాలను దృష్టిలో పెట్టుకునే ఈ విధమైన నియమం చేశారని చెప్పొచ్చు. సాధారణంగా ప్రతి వారినీ సాత్విక ... రాజస ... తామస లక్షణాలు ప్రభావితం చేస్తుంటాయి. ఉల్లిపాయ తామస గుణాన్ని ప్రేరేపిస్తుంది. అందువలన ఉద్వేగాలు ... ఉద్రేకాలు అధికంగా కలుగుతుంటాయి. ఫలితంగా ప్రశాంతతను కోల్పోయి, అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టు అవుతుంది.
భగవంతుడిని దర్శించడానికి ... స్మరించడానికి ... సేవించడానికి ప్రశాంతత అవసరం. అలాంటి ప్రశాంతతకు తామస లక్షణం భంగం కలిగిస్తూ వుంటుంది. ఈ కారణంగానే పూజలు ... నోములు ... వ్రతాలు జరుపుకునే కార్తీక మాసంలో ఉల్లిపాయలను ఉపయోగించకూడదనే నియమం చేయబడిందని చెప్పొచ్చు.