శ్రీకృష్ణుడి లీల
పాండురంగడి భక్తురాలైన సక్కుబాయికి అత్తగారింట్లో అనూహ్యమైన పరిస్థితి ఎదురౌతుంది. తాను ప్రాణంగా భావిస్తోన్న శ్రీకృష్ణుడి విగ్రహాన్ని అవతలపారేయమని వాళ్లు అనడం, దేవుడికి సంబంధించిన భజనలు చేయడానికి వీల్లేదని షరతులు పెట్టడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతుంది. కృష్ణుడి ఆరాధనకు అత్తగారు .. ఆడపడచు అడ్డురాకూడదనే ఉద్దేశంతో, ఇంటి పనులన్నీ తనమీద వేసుకుంటుంది.
అయితే ప్రతిపనిలోను ఆమె చిన్ని కృష్ణుడిని ఊహించుకుంటూ ఉండటంతో పొరపాట్లు జరుగుతుంటాయి. ఇంటి పనులను సక్కుబాయి సరిగ్గా చేయకపోవడానికి కారణం, ఆమె ధ్యాస కృష్ణుడిపై ఉండటమేనని ఆమె అత్తగారు భావిస్తుంది. ఇక కృష్ణుడి విగ్రహం తమ ఇంట్లో ఉండటానికి వీల్లేదంటూ వీధిలోకి విసిరేస్తుంది. తన కళ్ళ ముందరే కృష్ణుడి ప్రతిమ ముక్కలైపోవడంతో, కన్నీళ్లతో సక్కుబాయి కుప్పకూలిపోతుంది.
అంతలోనే కృష్ణుడి ప్రతిమ యథారూపాన్ని సంతరించుకుని, సక్కుబాయి ఒడిలోకి వస్తుంది. ఆ దృశ్యం చూసిన అత్తగారు ... ఆడపడచు ఇద్దరూ కూడా బిత్తరపోతారు. సక్కుబాయికి ఆ విగ్రహాన్ని ఇచ్చిన మాధవ స్వామి మంచివాడు కాదనీ, ఆయన మాయగాడు కావడం వల్లనే పగిలిపోయిన విగ్రహం అతుక్కుందని హడావిడి చేస్తారు. సక్కుబాయి ఆ మాటలు పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. తన భజనలు కొంత వరకూ ఫలించాయనీ, శ్రీకృష్ణుడు తనని అనుగ్రహించాడని సంతోషంతో పొంగిపోతూవుంటుంది.