ఆరోగ్యాన్నిచ్చే ఆంజనేయుడు
ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు. ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడే అడుగుముందుకు వేయగలుగుతారు ... అభివృద్ధి పథంలో ముందుకు సాగగలుగుతారు .. ఆనందాలను అనుభవించగలుగుతారు. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఒక్కో అడుగు వెనకబడిపోతుంటారు ... ఒక్కొక్కటిగా చేజార్చుకుంటూ వుంటారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆరోగ్యమనేది కచ్చితంగా ఒక వరమేననిపిస్తుంది. ఆ వరాన్ని అందుకోవడం కోసం అంతా ఆరాటపడుతుంటారు.
గుంటూరు జిల్లా 'కొత్తపేట' ప్రాంతానికి చెందిన వాళ్లు మాత్రం, ఆరోగ్యం విషయంలో తమకి హనుమంతుడు అండగా ఉన్నాడనే ధీమాను వ్యక్తం చేస్తుంటారు. ఇక్కడి హనుమంతుడు తన భక్తులు అనారోగ్యాల బారిన పడకుండా కాపాడతాడని అంటారు. మహిమాన్వితుడైన హనుమంతుడు ప్రాచీనకాలం నుంచి ఇక్కడ కొలువై ఉన్నాడని చెబుతారు.
స్వామివారు వెలసిన మందిరం శిధిలావస్థకు చేరుకోగా, చాలాకాలం క్రిందటే వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఆలయాన్ని పునర్మించాడు. ఆ రోజు నుంచి స్వామివారికి నిత్య పూజలు ... ఉత్సవాలు జరుగుతున్నాయి. వివిధ రకాల భంగిమలతో ఆలయమంతటా హనుమంతుడి రూపాలు దర్శనమిస్తూ వుంటాయి. గర్భాలయంలో స్వయంభువు హనుమంతుడు పరిమాణం పరంగా చిన్నగా కనిపిస్తున్నప్పటికీ జీవకళ ఉట్టిపడుతూ వుంటుంది.
సిందూర వర్ణంలో కనిపించే ఈ స్వామిని పూజించి తరించేందుకు మంగళవారం రోజున భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. హనుమజ్జయంతి ఉత్సవాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామిని దర్శించుకున్న భక్తులు, ఆరోగ్యాన్ని ఇవ్వమని కోరుతూ కానుకలు ... మొక్కుబడులు చెల్లిస్తూ వుంటారు.