కార్తీకమాస విశిష్టత
కార్తీకమాసం మహోన్నతమైన మాసం ... మహిమాన్వితమైన మాసం. శివకేశవులకు ప్రీతికరమైన పరమపవిత్రమైన మాసం. ఈ మాసంలో ఒక్కోరోజు ఒక్కో ప్రత్యేకతను ... ఒక్కో విశేషాన్ని కలిగివుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే హరిహరులను ఆరాధించే అనంతకోటి భక్తులకు ఇది నెలరోజుల పండుగ.
ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున శయనించిన విష్ణుమూర్తి, కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడు. ఈ కారణంగానే అనేక వ్రతాల ప్రారంభాలు ... ఉద్యాపనలు ఈ మాసంలో జరుగుతుంటాయి. కార్తీక మాసంలో ఉదయాన్నే బావులు ... చెరువులు ... నదులలోని నీటితో తలస్నానం చేయాలి. పగటిపూట ఉపవాసం ఉంటూ రాత్రి సమయంలో మాత్రమే భోజనం చేయాలి.
ఇక ఈ మాసంలో తుమ్మిపూలతో శివుడిని ... అవిసె పూలతో విష్ణువును పూజించడం వలన అనంతమైన పుణ్యఫలాలను పొందవచ్చు. కార్తీక దీపాలను సూర్యోదయానికి ముందు ... సంధ్యాసమయంలోను ఆవునెయ్యితో మాత్రమే వెలిగించాలి. కార్తీక దీపారాధన వలన స్త్రీలకు సౌభాగ్యం సుస్థిరమవుతుంది. కార్తీక మాసంలో దీపదర్శనం వలన ... ఉసిరికాయ దీపాలను దానంగా ఇవ్వడం వలన మోక్షం లభిస్తుందని అంటారు.
ఇక ఈ మాసంలో 'సోమవార వ్రతం' ఆచరించడం వలన విశేషమైన పుణ్యఫలాలు కలుగుతాయి. ఈ రోజున శివుడిని పంచామృతాలతో అభిషేకించి ... బిల్వదళాలతో అర్చించి పగటివేళ ఉపవాసం వుండి జాగరణ చేయాలి. ఈ నియమాలను పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించడం వలన అనేక దోషాలు అవలీలగా తొలగిపోతాయనీ, సకల సంపదలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
ఈ విశ్వమంతా కూడా శివకేశవుల ఆదేశంతో ... అనుగ్రహంతో నడుస్తోంది. అలాంటి హరిహరులను ప్రసన్నం చేసుకునేందుకు అనుకూలంగా వుండే మాసాల్లో కార్తీకమాసానికి సాటిరాగల మాసం మరొకటి లేదని 'స్కాంద పురాణం' చెబుతోంది.