లక్ష్మీ గణపతి ఆలయం
వినాయకుడు విష్ణు స్వరూపుడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే ఆయనని లక్ష్మీగణపతి అని పిలుస్తుంటారు. వినాయకుడిని పూజించకుండా ఎవరూ ఎలాంటి శుభకార్యాన్ని ప్రారంభించరు. అనునిత్యం ఆయనని దర్శించడం వలన శుభాలు కలుగుతాయనీ, లాభాలు చేకూరతాయని అంటారు.
అనుదినం ఆయనను సేవించుకునే మహద్భాగ్యం కోసం అన్ని ప్రాంతాల వారు గణపతి ఆలయాల నిర్మాణం పట్ల శ్రద్ధాసక్తులు చూపుతుంటారు. ఫలితంగా నేడు అనేక ప్రదేశాల్లో గణపతి ఆలయాలు దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్ - వనస్థలిపురంలోని 'లక్ష్మీగణపతి ఆలయం' కూడా ఈ నేపథ్యంలోనిదే. అర్థం ఒకటే అయినా అంతా 'గణేష్ టెంపుల్' అని పిలుస్తుంటారు.
1979లో నిర్మించబడిన ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఇక్కడి గణపతిని ఆరాధించిన వారు ఉన్నత స్థానాలకి చేరుకుంటూ ఉండటంతో, గణపతి మహాత్మ్యం నిరూపితమవుతూ భక్తుల సంఖ్య పెరుగుతోంది. సువిశాలమైన ప్రదేశం ... చక్కని రాజగోపురం ... ప్రాకారాలు ఆలయ వైభవానికి అద్దం పడుతుంటాయి.
ఉత్సవాలకి ... ఊరేగింపులకి ... సేవలకి అనుకూలంగా ఇక్కడి ఆలయానికి నలువైపులా నాలుగు వీధులు వుండటం విశేషంగా అనిపిస్తూ వుంటుంది. ప్రతి బుధవారం ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా వుంటుంది. గణపతి నవరాత్రులను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. గణపతి హోమాలు విరివిగా జరుగుతుంటాయి. గణపతికి ఇరువైపులా వివిధ దేవతా మందిరాలు దర్శనమిస్తుంటాయి.
ఈ ప్రత్యేక మందిరాలలో శివుడు .. అయ్యప్పస్వామి .. సుబ్రహ్మణ్యస్వామి .. లక్ష్మీనారాయణస్వామి .. ప్రసన్నాంజనేయ స్వామి .. బ్రహ్మంగారు .. జయదుర్గ కొలువై భక్తులను అనుగ్రహిస్తూ వుంటారు. ఇది అనేక దేవతామూర్తుల నిలయం కావడం వలన, ఏడాది పొడవునా వివిధ రకాల ఉత్సవాలతో కళకళలాడుతూ కనిపిస్తూ వుంటుంది ... కనువిందు చేస్తూ వుంటుంది.