ఘన విజయాల గణపతి
వినాయకుడు అనగానే చిన్నల నుంచి పెద్దల వరకూ అపారమైన భక్తి విశ్వాసాలను ప్రదర్శిస్తూ వుంటారు. అనునిత్యం ఆ స్వామిని దర్శించి, తమకి సకల శుభాలు చేకూరేలా చేయమని కోరుతుంటారు. జీవితంలో ఏ అవకాశం దక్కాలన్నా ... ఆయా రంగాల్లో అంచలంచెలుగా ఎదగాలన్నా అందుకు వినాయకుడి అనుగ్రహం కావాలని అంతా భావిస్తుంటారు.
ఈ కారణంగానే పర్వదినాల్లో మాత్రమే కాకుండా ఎప్పుడు చూసినా గణపతి ఆలయాలు భక్తులతో రద్దీగా కనిపిస్తూ వుంటాయి. అలా నిత్యం భక్తులతో సందడిగా కనిపించే ఆలయం ఖమ్మం జిల్లా 'కొత్తగూడెం'లో దర్శనమిస్తుంది. స్వయంభువుగా ఆవిర్భవించిన ఇక్కడి స్వామిని భక్తులు ఘన విజయాల నిచ్చే గణపతిగా కొలుస్తుంటారు.
ఈ స్వామిని పూజించిన వారంతా తమకి సంబంధించిన రంగాల్లో వరుస విజయాలను సాధిస్తూ ఉన్నత స్థితికి చేరుకోవడమే ఇందుకు కారణం. ఈ స్వామిని పూజించి ఆరభించిన కార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయని ఇక్కడి వాళ్లంతా విశ్వసిస్తుంటారు. గర్భాలయంలో స్వయంభువు గణపతి విగ్రహం పాదాల చెంత మరో వినాయక విగ్రహం ప్రతిష్ఠించబడి వుంటుంది.
ప్రతి మంగళ - బుధవారాల్లో స్వామివారికి ప్రత్యేక పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఇక్కడి భక్తులు ప్రతి శుభకార్యానికి ముందుగా స్వామివారి నుంచి తొలి అనుమతిని అందుకుంటారు. తొలి ఆహ్వానాన్ని అందజేసి ఆయన ఆశీస్సులను పొందుతుంటారు. ఇదే ప్రాంగణంలో శివ పార్వతులు ... నాగదేవత ... నవగ్రహాలు కొలువై పూజలందుకుంటూ వుంటారు.