పూజలో స్టీలు పాత్రలు?
పూర్వం ఎవరి ఇంట్లో చూసినా ఇత్తడి ... రాగి పాత్రలే ఎక్కువగా కనిపిస్తూ ఉండేవి. నిత్యావసరాలకి ఉపయోగించేవి ... వేడుకలకు అవసరమయిన భారీ పాత్రలను ఇత్తడితోను ... పూజాది కార్యక్రమాలకి వాడే పాత్రలను రాగితోను చేయించేవారు. ఇక ధనిక వర్గానికి చెందిన వారు మాత్రం, పూజా సామాగ్రిగా వెండి లేదా బంగారు పాత్రలు వాడేవారు.
ఇప్పుడు కూడా పూజాది కార్యక్రమాలకి వెండి - బంగారు పాత్రలు ఉపయోగించే వారు లేకపోలేదు. అయితే ఒకప్పటి కంటే ఇప్పుడు అలాంటివారి సంఖ్య తగ్గిందనే చెప్పాలి. ఇక మధ్యతరగతి వారు కూడా ఇత్తడి - రాగి పాత్రలను వాడటం చాలావరకు తగ్గించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎవరి ఇంట్లో చూసినా స్టీలు పాత్రలు దర్శనమిస్తున్నాయి.
పూజకి ఉపయోగించే అన్ని రకాల పాత్రలు నేడు స్టీలులోనే కనిపిస్తున్నాయి. నగిషీ కారణంగా స్టీలు ... ఇనుము అనే భావన కలగనీయదు. ఈ కారణంగానే దీని వాడకం అంతకంతకూ పెరుగుతూపోతోంది.అయితే ఇటు ఆరోగ్య పరంగాను ... అటు ఆధ్యాత్మిక పరంగాను స్టీలు పాత్రలను వాడకూడదని శాస్త్రం చెబుతోంది.
స్తోమత వుంటే వెండి - బంగారం, లేదంటే ఇత్తడి - రాగి పాత్రలను వాడటమే అన్ని విధాలా మంచిదని చెబుతోంది. స్టీలు ( ఇనుము) శని సంబంధమైన లోహం కనుక, దానికి బదులుగా ఇతరలోహాలతో చేసిన పాత్రలను మాత్రమే పూజకు వాడాలనీ, అప్పుడే ఎలాంటి దోషాలు లేని పరిపూర్ణమైన ఫలితాలను పొందవచ్చని స్పష్టం చేస్తోంది.