గణపతికి ఇష్టమైన నైవేద్యం
దైవకార్యమైనా ... శుభకార్యమైనా గణపతి పూజతో ఆరంభించడం అనాదిగా వస్తోంది. ప్రారంభిస్తోన్న కార్యక్రమం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా కొనసాగడానికి అంతా గణపతిని ఆరాధిస్తుంటారు. గణపతి అనుగ్రహం వుంటే ఎంతటి కష్టతరమైన కార్యక్రమమైనా తేలికగా పూర్తి అవుతుందని విశ్వసిస్తుంటారు. నియమనిష్టలతో పూజించడం వల్లనే కాదు, ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించడం వలన కూడా సుఖసంతోషాలు కలుగుతాయని అంటారు.
సాధారణంగా గణపతికి ఉండ్రాళ్లు ... కుడుములు నైవేద్యంగా సమర్పిస్తుంటారు. వినాయకచవితి రోజున కూడా ఈ వంటకాలనే ఆయనకి నైవేద్యం పెడుతుంటారు. ప్రేమతో గణపతిని ఆవాహన చేసి ఏ నైవేద్యాన్ని సమర్పించినా కాదనకుండా స్వీకరిస్తాడు. అందుకు తగిన విధంగానే భక్తులకు శుభాలను ... లాభాలను అనుగ్రహిస్తాడు. అయితే గణపతి మనసు తెలుసుకుని ఆయనకి ఇష్టమైన వంటకాలను తయారుచేసి పెట్టడం వలన త్వరిత గతిన మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతుంటారు.
సహజంగానే గణపతికి బెల్లం అంటే మహా ఇష్టం. బెల్లం పానకంతో అభిషేకం చేసినా ... బెల్లం పానకాన్ని నైవేద్యం పెట్టినా ఆయన సంతోషపడిపోతాడు. ఇక బెల్లంతో చేసిన ఏ పిండి వంటకమైనా ఆయనకి ఎంతో ప్రీతిని కలిగిస్తూ ఉంటుంది. బెల్లంతో చేసిన పదార్థాలను ఆయన ఎంతమాత్రం వదలకుండా ఆరగిస్తాడు ... తనని సంతోష పెట్టిన వారికి ఆయురారోగ్యాలను అనుగ్రహిస్తాడు.