రక్షణగా తులసికోట!

రక్షణగా తులసికోట!

రక్షణగా తులసికోట!
తులసి అనే పేరులోనే ఎంతో పవిత్రత కనిపిస్తుంది ... అది చూపే ప్రభావం కారణంగా దానికి అంతటి విశిష్టమైన స్థానం లభిస్తోంది. తులసిని దైవంగా భావించడం ... భక్తి శ్రద్ధలతో పూజించడం అనాదిగా వస్తోంది. ఇసుక రవ్వంత భక్తి మనసులో వున్న ప్రతి ఒక్కరి ఇంట్లోను తులసికోట వుంటుంది.

తులసిని పూజించడం వలన సమస్త దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. తులసిపై నుంచి వచ్చే గాలిని పీల్చడం వలన శ్వాస సంబంధమైన వ్యాధులు దూరమవుతాయని వైద్యశాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక దుష్ట ప్రయోగాలు కూడా తులసికోటను దాటి లోపలికి రాలేవని అంటారు. ఇన్ని రకాల ప్రత్యేకతలు వున్న కారణంగానే తులసికోటను అంతా దైవస్వరూపంగా భావించి ప్రార్ధనలు ... ప్రదక్షిణలు చేస్తుంటారు.

ఇక మరొక విశిష్టత ఏంటంటే ఇంటికి సంబంధించిన నాలుగు దిక్కుల్లోను తులసికోట ఉండవచ్చని శాస్త్రం చెబుతోంది. తులసికోట తూర్పు దిక్కున వుండటం వలన 'సౌభాగ్యం' ... పడమరన వుండటం వలన 'సంపదలు' ... ఉత్తరాన వుండటం వలన 'మంచి ఆలోచనలు' ... దక్షిణ దిక్కున వుండటం వలన 'దీర్ఘాయుష్షు' కలుగుతాయి.

ఇక తులసి దళాలను స్త్రీ .. పురుషులు ఎవరైనా తుంచవచ్చు. అయితే ఎలాంటి మైలా .. అంటూ లేకుండా, శుచిగా వున్నప్పుడు మాత్రమే తులసికోట దగ్గరికి వెళ్లడం చేయాలి. తులసికోట దగ్గర బట్టలు ఉతకడం ... కాళ్లు - చేతులు కడుక్కోవడం ... తల దువ్వుకోవడం వంటివి చేయకూడదని శాస్త్రం చెబుతోంది. ఈ నియమాలు పాటించని వారు దోషాలబారిన పడకతప్పదని స్పష్టం చేస్తోంది.

More Bhakti Articles