శ్రీ వల్లూరమ్మ క్షేత్రం
అమ్మవారు ఆవిర్భవించిన అత్యంత శక్తిమంతమైన క్షేత్రాల్లో 'శ్రీ వల్లూరమ్మ క్షేత్రం' ఒకటిగా చెప్పబడుతోంది. ఇటు ఆధ్యాత్మిక వైభవం ... అటు చారిత్రక వైభవం ఉట్టిపడే ఈ క్షేత్రం ప్రకాశం జిల్లా ఒంగోలులో దర్శనమిస్తోంది. ఆపదలను గట్టెక్కించి ఆనందాల సిరులను ప్రసాదించే తల్లిగా భక్తులు అమ్మవారిని కొలుస్తుంటారు.
వెంకటగిరి రాజులు ... ఒంగోలు రాజులు అమ్మవారిని తమ ఇలవేల్పుగా భావించి ఆరాధించారు. వీరి కాలంలో అమ్మవారి ఆలయం వైభవంతో వెలుగొందినట్టు శాసనాల వలన తెలుస్తోంది. ఇక్కడి అమ్మవారిని 'ఉల్కాముఖి' గా భక్తులు పిలుచుకుంటూ వుంటారు. అమ్మవారు యజ్ఞ గుండం నుంచి ఉల్కల గుంపులా కాంతి పుంజమై బయటికి వచ్చిందనీ, ఈ కారణంగానే ఆమెకి ఆ పేరు వచ్చిందని అంటారు.
ఇక వల్లూరులో వెలసిన కారణంగా వల్లూరమ్మగా పూజలు అందుకుంటోంది. విశాలమైన ప్రాంగణం ... పొడవైన ప్రాకారాలు ... అందమైన నగిషీలతో అలరారే మంటపాలు ఆనాటి వైభవాన్ని ప్రతిబింబిస్తుంటాయి. గర్భాలయంలో అమ్మవారు సౌమ్యమూర్తిగా కనిపిస్తుంది. అనేకరకాల ఆయుధాలను ధరించి ఉన్నప్పటికీ అనురాగాన్ని కురిపించే అమ్మతనం ఆ రూపంలో స్పష్టంగా కనిపిస్తూ వుంటుంది.
ప్రతి శుక్రవారం అమ్మవారికి అభిషేకాలు ... కుంకుమ పూజలు జరుపుతుంటారు. పర్వదినాల్లో అమ్మవారికి విశేష పూజలు ... ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులను ... అనుగ్రహాన్ని పొందడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విశేషమైన సంఖ్యలో తరలివస్తుంటారు. కామధేనువు వంటి అమ్మవారి కరుణను పొందినందుకు కృతజ్ఞతగా మొక్కుబడులు చెల్లిస్తూ వుంటారు.