నైవేద్యాలు ఎలా వుండాలి ?
గర్భగుడిలో కొలువైన దైవానికే కాదు ... ఇంట్లోని పూజా మందిరంలో నెలవైన దైవానికి కూడా నైవేద్యం పెట్టవలసిందే. చేసేది నిత్యపూజ అయినా ... విశేష పుణ్యతిథుల్లో చేసే ప్రత్యేక పూజే అయినా నైవేద్యం తప్పనిసరిగా సమర్పించవలసిందే. దైవానికి జరిపే ఉపచారాలలో నైవేద్యానికి ఎంతో విశిష్టత వుంది. దైవంపై మనకి గల భక్తిశ్రద్ధలు బయటపడేది ఈ నైవేద్యాల విషయంలోనే.
ఈ కారణంగానే ఇష్ట దైవాలకిగల ఇష్టాలు తెలుసుకుని మరీ నైవేద్యాలు తయారు చేసేందుకు సిద్ధపడతారు. దైవానికి ఎలాంటి లోటూ జరగకూడదనే ఉద్దేశంతో, వివిధ రకాల నైవేద్యాలను తయారు చేస్తారు. వాటిలో కొన్ని తీపి పదార్థాలు ... మరికొన్ని కారంతో కూడిన పదార్థాలు ఉంటూవుంటాయి. దైవానికి సమర్పించే నైవేద్యాలు ఎంతో రుచిగా ... శుచిగా ఉండాలనే ఉద్దేశంతోనే అంతా ఎంతగానో కష్టపడతారు.
ఈ నేపథ్యంలో కొంతమంది ముందుగానే నైవేద్యాలను తయారుచేసి పెట్టుకుంటే, మరికొందరు అప్పటికప్పుడు సిద్ధంచేసి పెడుతుంటారు. అయితే ఈ రెండు విధానాలు కూడా సరైనవికావని శాస్త్రం చెబుతోంది. చాలాముందుగా తయారుచేసినవి బాగా చల్లారి పోతాయికనుక వాటిని నైవేద్యంగా పెట్టరాదని శాస్త్రం చెబుతోంది. అప్పటికప్పుడు సిద్ధం చేసినవి చాలా వేడిగా వుంటాయి కనుక వాటిని నైవేద్యం పెట్టకూడదని అంటోంది.
అలాగే అతి పులుపు ... అతికారం గల నైవేద్యాలను కూడా దైవానికి సమర్పించరాదని చెబుతోంది. నైవేద్యం కోసం ఏ పదార్థాలను వేడిగా తయారుచేసినా అవి గోరువెచ్చగా వున్నప్పుడు మాత్రమే దైవానికి సమర్పించాలని స్పష్టం చేస్తోంది. ఈ నియమాలను పాటించకుండా నైవేద్యాలను సమర్పించడం వలన ఉత్తమగతులు పొందే అవకాశాలు కోల్పోవడం జరుగుతుందని తెలియపరుస్తోంది.