కుంకుమ ధారణ
భారతీయుల జీవన విధానంలో ప్రతి అంశం ఆచారవ్యవహారాలతో ముడిపడివుంటుంది. అటు ఆధ్యాత్మిక పరమైన అంశాలు ... ఇటు ఆరోగ్యపరమైన అంశాల మేళవింపుగా కనిపించే ఆచార వ్యవహారాలలో 'కుంకుమ ధారణ' ఒకటిగా కనిపిస్తూ వుంటుంది. పురుషులు ... స్త్రీలు నుదుటున కుంకుమ ధరించడం అనేది పూర్వకాలం నుంచి వస్తోంది.
కుంకుమ ధారణ అనేది స్త్రీల జీవితంలో ఒక భాగమైపోగా, శుభకార్యాల సమయంలోను ... ఆలయానికి వెళ్లినప్పుడు మాత్రమే పురుషులు ధరిస్తూ వస్తున్నారు. స్త్రీల విషయంలో కుంకుమ వారి సౌభాగ్యాన్ని సూచిస్తూ వుంటుంది. ఇక పురుషుల విషయంలో వారి సాత్విక గుణాన్ని ఆవిష్కరిస్తూ వుంటుంది.
కుంకుమ ధారణ చేయడానికి ... చేసుకోవడానికి వుండే అర్హత సామాన్యమైనది కాదు. అందుకే స్త్రీలు దానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ వుంటారు. అయితే ఆధునిక కాలంలో నుదుటున కుంకుమ బొట్టుకు బదులుగా, వివిధ రకాల బొట్టు బిళ్లలను వాడటం అలవాటుగా మారిపోయింది. వస్త్రాలకు తగిన రంగు బొట్టును ధరించాలనే ఆలోచనే ఇందుకు కారణమైంది.
వయసుతో సంబంధం లేకుండా అంతా ఈ పద్ధతినే పాటిస్తూ వుండటం నిజంగానే విచారించదగిన విషయం. నుదుటున కుంకుమ బొట్టు తప్ప మరేది ధరించినా ఆధ్యాత్మిక పరమైన దోషం ... అనారోగ్యం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. రెండు కనుబొమల మధ్య అగ్నితత్త్వం ఉంటుందనీ, దానిని చల్లబరచడం కోసమే ఆ ప్రదేశంలో కుంకుమ దిద్దడం జరుగుతోందని స్పష్టం చేస్తోంది. కుంకుమ దిద్దకపోవడం వలన ఇక్కడి నియంత్రణ వ్యవస్థ దెబ్బతింటుంది.
ప్రతివారికి కూడా నుదురు అనేది ఒక శక్తిమంతమైన కేంద్రంగా వుంటుంది. ఇతరుల దృష్టి నేరుగా ఈ ప్రదేశంలో పడటం వలన ఆ వ్యక్తుల సహజమైన శక్తి బలహీనపడే అవకాశముంది. అందువలన ఇతరుల దృష్టిని నిరోధించేదిగా ఆ ప్రదేశంలో కుంకుమ దిద్దుకోవడం అనాదిగా వస్తోంది. కాబట్టి కుంకుమ ధారణ అనేది కేవలం అందానికి ... అలంకారానికి మాత్రమేనని భావించకుండా, మన ఆచార వ్యవహారాలని గౌరవిస్తూ వాటిని అనుసరించవలసిన అవసరం అందరిపైనా వుంది.