పోతనకి శ్రీరాముడి పరీక్ష !
మహాభక్తుడైన పోతన నిరంతరం దైవనామ స్మరణ చేస్తూ ఉండేవాడు. దైవారాధనలోని గొప్పతనం గురించి ఆయన గ్రామస్తులకు చెబుతూ ఉండేవాడు. పోతన పట్ల ఆ గ్రామస్తులు ఎంతో గౌరవ మర్యాదలను చూపుతూ వుండేవాళ్లు. ఓ వైపున ఇల్లు గడవడం కష్టంగా వుంటే, మరో వైపున ఆయన దానధర్మాలు చేస్తూ వుండటం పట్ల కుటుంబ సభ్యులు అసహనానికి లోనయ్యేవారు.
ఇంట్లోకి కావలసిన వంట సామాగ్రి అతి కష్టం మీద సమకూర్చుకుని ఆ రోజున ఆయన భార్య వంట చేసింది. అప్పటికే కొన్నిరోజులుగా వాళ్లు పస్తులు వుంటున్నారు. అంతా భోజనాలకి కూర్చుంటూ వుండగా, బక్కచిక్కిన భిక్షగాడి వేషంలో శ్రీ రాముడు అక్కడికి వచ్చాడు. ఆ భిక్షగాడి పిలుపువిని పోతన బయటికి వచ్చాడు. తాను కొన్ని రోజులుగా పస్తులు వుంటున్నట్టు చెప్పాడు భిక్షగాడు.
ఆయనని లోపలికి ఆహ్వానించి, తమ ఇంటికి అతిథి వచ్చినట్టుగా చెప్పాడు పోతన. ఆ భిక్షగాడి పక్కనే కూర్చుని భార్యతో అన్ని పదార్థాలను వడ్డింప జేశాడు. ఆ భిక్షగాడు కడుపు నిండుగా ఆరగించి, అందరినీ ఆశీర్వదించి వెళ్లాడు. ఇక తమకి భోజనం లేదనీ ... ఉన్నదంతా ఆ భిక్షగాడికే వడ్డించానని పోతనతో భార్య చెప్పింది.
తాము భోజనం చేయడం వలన కడుపు మాత్రమే నిండుతుందనీ, అతిథులను సంతృప్తి పరచడం వలన బతుకు పండుతుందని చెప్పాడు పోతన. భోజన సమయంలో వచ్చిన ప్రతి జీవి దైవ స్వరూపమంటూ మంచినీళ్లు తాగి పడుకున్నాడు. ఇదంతా గమనించిన శ్రీ రాముడు ఇక పోతనను అనుగ్రహించాలని నిర్ణయించుకున్నాడు.