పూజలో ఆవునెయ్యి
దైవకార్యాల్లోను ... శుభకార్యాల్లోనూ ఆవునెయ్యిని ఉపయోగించడమనేది ప్రాచీనకాలం నుంచి ఒక నియమంగా వస్తోంది. సాధారణంగా వివిధ క్షేత్రాల్లో ... వివిధ దేవతా స్వరూపాలకు నిత్యాభిషేకాలను పంచామృతాలతో నిర్వహిస్తుంటారు. ఈ పంచామృతాలలో ఆవుపాలు .. ఆవుపెరుగు ... ఆవునెయ్యి ... ప్రధానంగా కనిపిస్తూ వుంటాయి. ఈ మూడింటిలోనూ ఆవునెయ్యి అత్యంత పవిత్రమైనదిగా ... విశిష్టమైనదిగా చెబుతుంటారు.
ఈ కారణంగానే దైవకార్యాలకి సంబంధించిన యజ్ఞయాగాది కార్యక్రమాలలోనూ, దోష నివారణార్థం చేసే శాంతి హోమాలలోను ఆవునెయ్యి తప్పనిసరిగా వాడుతుంటారు. అలాగే దేవతలకి నివేదన చేసే వివిధరకాల పదార్థాలలోను ఆవునెయ్యినే ఉపయోగిస్తుంటారు. దేవాలయాలకి సంబంధించిన విషయాల్లోనే కాదు, ఇంటికి సంబంధించిన పూజా కార్యక్రమాల్లోనూ ఆవునెయ్యిని ఉపయోగించడమే శ్రేష్టమని శాస్త్రం చెబుతోంది. దీపారాధనకు ... నైవేద్యాలకు తప్పనిసరిగా ఆవునెయ్యినే వినియోగించాలని అంటోంది.
అయితే కొంతమంది ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. ఆవునెయ్యి అందుబాటులోలేదని చెప్పేసి గేదె నెయ్యితో పని పూర్తి చేస్తుంటారు. ఈ విధంగా చేయడం వలన అనేక దోషాలు అక్కున చేరతాయని శాస్త్రం చెబుతోంది. గేదె నెయ్యితో దీపారాధన చేయడం వలన, నైవేద్యాలు తయారు చేయడం వలన నీచమైన జంతుజన్మలు కలుగుతాయని అంటోంది.
అందువలన పుణ్యఫలాలను ఆశించి చేసే దైవకార్యాలలో పాపాలను కొనితెచ్చే పనులు జరగకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా వుంది.ఈ విషయంలో శాస్త్రం సూచించిన నియమాలను పాటించడమే అన్ని విధాలా మంచిది. అప్పుడే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ... ఉత్తమగతులు లభిస్తాయి.