శ్రీవారి నైవేద్యాలు

శ్రీవారి నైవేద్యాలు
తిరుమల శ్రీవారికి భక్తుల తాకిడి విపరీతంగా వుంటుంది. ఎన్నో బాధలు పడుతూ ... మరెన్నో కష్టాలు అనుభవిస్తూ ఆయన దర్శనం వల్లనే అవి తొలగిపోతాయని భక్తులు భావిస్తుంటారు. అందుకోసం ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది ఆయన పాదాల చెంతకి చేరుతుంటారు. అలాంటి వారిని స్వామి చిరునవ్వుతోనే అనుగ్రహిస్తుంటారు.

ఇంత తీరికలేకుండా వున్న ఈ నేపథ్యంలో, స్వామివారికి సమర్పించబడే నైవేద్యాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి భక్తులకి సహజంగానే వుంటుంది. ఉదయం వేళలో స్వామికి పులిహోర ... దధ్యోదనం ... చక్కర పొంగలి ... లడ్లు ... వడలు ... అప్పాలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ సమయంలో 'ఓడు' అనే మీగడ పెరుగన్నం మాత్రమే గర్భాలయం లోపల నైవేద్యంగా సమర్పించబడుతుంది.

ఇక మధ్యాహ్నం వేళలో అన్నప్రసాదలతో పాటు పాయసం ... కేసరీ బాత్ నైవేద్యంగా సమర్పిస్తారు. సాయంత్ర వేళలో అన్నప్రసాదాలతో పాటుగా నెయ్యి దోశలు నైవేద్యంగా సమర్పిస్తారు. రాత్రి వేళలో చక్రపొంగలి మాత్రమే నివేదన చేస్తారు. నిరంతరం సేవలు ... ఉత్సవాలు జరుగుతుంటాయి కనుక, ఈ మూడు వేళల్లోనే కాకుండా ఆయా సందర్భాల్లోనూ స్వామివారికి నైవేద్యాలు అందుతూ వుంటాయి.

వారంలో ప్రతి రోజు ... విశేషమైనటు వంటి పర్వదినాల్లోను ప్రత్యేక వంటకాలు స్వామివారికి నివేదించబడుతుంటాయి. సుప్రభాత వేళలో పాలు - వెన్న ఆరగించిన స్వామి, ఏకాంత సేవలో పాలు - పండ్లు స్వీకరించి విశ్రాంతి తీసుకుంటారు.

More Bhakti Articles