పాదరస శివలింగ ఆరాధన

శివలింగ దర్శనమే సమస్త పాపాలను హరించి వేస్తుందనీ .. శివ నామ స్మరణయే ముక్తిని ప్రసాదిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ప్రతి శివలింగం .. సాక్షాత్తు శివస్వరూపమే, ఒక్కో రకమైన శివలింగాన్ని పూజించడం వలన .. ఒక్కో ఫలితం లభిస్తుందనేది ఆధ్యాత్మిక గ్రంధాల్లో కనిపిస్తుంది.

ఈ కారణంగానే బంగారం .. వెండి ..  ఇత్తడి వంటి లోహాలతో చేయబడిన శివలింగాలతో పాటు, స్పటిక .. పాదరస శివ లింగాలను కూడా పూజిస్తూ వుంటారు. పాదరస శివలింగాన్ని పూజించడం వలన. జన్మజన్మల పాపాలు నశిస్తాయనేది మహర్షుల మాట. ఒక్క పాదరస శివలింగాన్ని పూజించడం వలన, అనేక సంఖ్యలో గల శివలింగాలను ఆరాధించిన ఫలితం లభిస్తుందని అంటున్నారు. పాదరస శివలింగ ఆరాధన వలన, అనారోగ్యాలు .. ఆర్ధిక పరమైన సమస్యలు తొలగిపోయి, ఆరోగ్యం .. ఐశ్వర్యం లభిస్తాయని సెలవిచ్చారు.  


More Bhakti News