స్పటిక శివలింగ ఆరాధన

శివ నామస్మరణ .. శివలింగ దర్శనం .. శివాభిషేకం అనేక జన్మల పాపాలను పటాపంచలు చేస్తాయి. అందువలన చాలామంది తమ పూజా మందిరాల్లో చిన్నపాటి శివలింగాలను ఏర్పాటు చేసుకుని అనునిత్యం అభిషేకం చేస్తూ వుంటారు. కొంతమంది బంగారపు శివలింగాన్ని .. మరికొందరు వెండి శివలింగాన్ని .. ఇంకొందరు ఇత్తడి శివలింగాన్ని తయారు చేయించుకుని ఆరాధిస్తూ వుంటారు.

ఒక్కో విధమైన శివలింగాన్ని పూజించడం వలన, ఒక్కో విశేషమైన ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఇక కొంతమంది 'స్పటిక శివలింగం' సంపాదించుకుని తమ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకుంటూ వుంటారు. స్పటిక లింగాన్ని ఆరాధించడం వలన దారిద్య్రం తొలగిపోతుంది. స్పటిక శివలింగాన్ని పూజించడం వలన, సిరిసంపదలు చేకూరతాయి. సౌభాగ్య సిద్ధి కలగడమే కాకుండా, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. మనసులోని ధర్మబద్ధమైన కోరికలు నెరవేరతాయి.     


More Bhakti News