నాగేశం
మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోన్న 'నాగేశ్వర జ్యోతిర్లింగం' గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక సమీపంలో విలసిల్లుతోంది. ద్వారక ... శ్రీ కృష్ణుడి అంతఃపురమైన భేట్ ద్వారకా ప్రాంతానికి మధ్యలోని నాగేశ్వర గ్రామంలో ఈ జ్యోతిర్లింగం ఆవిర్భవించింది. దారుకావనమనే ఈ ప్రదేశం జనావాసాలకు దూరంగా వుంటుంది.
దారుక అనే రాక్షసి వరబల గర్వంతో సాధుజనులను హింసించడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ఆమె కొందరు శివ భక్తులను బంధించింది. వాళ్లందరి అభ్యర్ధన మేరకు పరమశివుడు నాగేశ్వరుడిగా అవతరించాడు. రాక్షసులందరినీ శంకరుడు సంహరిస్తూ ఉండటంతో, దారుకా పారిపోయి అమ్మవారిని శరణు కోరినట్టు శివపురాణం చెబుతోంది.
అమ్మవారి అనుగ్రహం కారణంగానే ఈ క్షేత్రానికి దారుకావనమనే పేరు వచ్చింది. గర్భాలయంలో స్వామివారు నాగేశ్వరుడిగా ... వెనుక భాగంలో అమ్మవారు నాగేశ్వరిగా పూజలందుకుంటూ వున్నారు. ఇక్కడ భక్తుల రద్దీ తక్కువగా వుండటం వలన ప్రశాంతంగా స్వామివారికి స్వయంగా అభిషేకం చేయవచ్చు.
ఈ క్షేత్రాన్ని దర్శించిన వారు ద్వారకలో శ్రీ కృష్ణుడి జీవితంలోని మరపురాని ఘట్టాలకు సజీవ సాక్ష్యాలుగా నిలిచిన ప్రదేశాలను కూడా తిలకించవచ్చు. అప్పుడే ఈ యాత్ర ఒక అర్థాన్ని ... పరమార్థాన్ని ... ఆనందాన్ని ... అనుభూతిని ఇస్తుందని చెప్పొచ్చు.