గులాబీలతో లక్ష్మీదేవి ఆరాధన

గులాబీలతో లక్ష్మీదేవి ఆరాధన
జీవితం సంతోషంగా సాఫీగా సాగిపోవాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండవలసిందే. లక్ష్మీదేవి కరుణిస్తేనే అవసరాలు తీరతాయి ... ఆపదలు గట్టెక్కుతాయి. లేదంటే ఆర్ధికపరమైన ఇబ్బందులతో సతమతమైపోవడం జరుగుతుంది.

సకలసంపదలను ప్రసాదించే లక్ష్మీదేవి అందరిపట్ల ఎంతో దయకలిగి ఉంటుంది. అందరినీ చల్లగా చూడటం కోసమే ఆరాటపడుతూ ఉంటుంది. కాకపోతే తాను ఉండాలనుకునే చోట ప్రశాంతత ... పవిత్రత ఉండాలని కోరుకుంటుంది. అలా ఆ తల్లి మనసుకి నచ్చేలా నడచుకుంటే చాలు, ఆమె ఆ ఇంట స్థిరనివాసం చేస్తుంది.

అందుకే పనికిరాని వస్తువులు ... అనవసరమైన వస్తువులు ఇంట్లో ఉంచరాదని పెద్దలు చెబుతుంటారు. అలాంటివి లేకుండా పరిశుభ్రంగా ఉండే ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పక అడుగుపెడుతుందని అంటారు. అలా వచ్చిన అమ్మవారి మనసు గెలుచుకోవాలంటే అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ తల్లిని పూజిస్తూ ఉండాలి. ముఖ్యంగా ప్రతి శుక్రవారం అమ్మవారిని 'గులాబి' పూలతో అర్చిస్తూ ఉండాలి.

అమ్మవారికి గులాబీలు ఎంతో ప్రీతికరమైనవిగా చెబుతారు. ఈ పూలతో ప్రతి శుక్రవారం అమ్మవారిని పూజించడం ఆ తల్లికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. సంతృప్తి చెందిన అమ్మవారు తన భక్తులను ఆనందంతో అనుగ్రహిస్తుంది. ఫలితంగా ఆదాయమార్గాలు పెరిగి ఆర్ధికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పబడుతోంది.
Get the ap7am app Free · Opens in one tap Install

More Bhakti Articles