ఈ దేవతల వాహనాలు ఇవే !
కొన్ని క్షేత్రాలకు వెళ్లినప్పుడు అక్కడ ఏడుగురు స్త్రీ దేవతల శిలా ప్రతిమలు కనిపిస్తూ వుంటాయి. వీళ్లందరూ కూడా ఒకే భంగిమలో వరుసగా కూర్చుని కనిపిస్తుంటారు. ప్రాచీన కాలం నాటి ఆలయాల ప్రాంగణంలోను వీరి ప్రతిమలు కనిపిస్తూ ఉన్నప్పటికీ వాళ్లెవరనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించే వాళ్లు చాలా తక్కువమందే ఉంటారని చెప్పాలి. ఇక కొన్ని ఆలయాలలో వీరికి సంబంధించిన వివరాలు ... విషయాలను తెలియపరచడం జరగదు.
ఇలా వరుసగా ఒకే వేదికపై దర్శనమిచ్చే ఈ దేవతలనే 'సప్తమాతృకలు' అంటారు. బ్రహ్మణ ... వైష్ణవి ... మహేశ్వరి ... కౌమారి ... వారాహి ... ఇంద్రాణి ... చాముండి అనే దేవతలు ఈ జాబితాలో కనిపిస్తూ వుంటారు. అంధకాసురుడు అనే రాక్షసుడిని సంహరించడంలో శివుడికి సహకరించి, లోక కల్యాణానికి కారణమైన దేవతలు వీరే. ఇందుకోసం సాక్షాత్తు బ్రహ్మాది దేవతలు తమ అంశలను ఏడు శక్తి స్వరూపాలుగా ఆవిష్కరించడం జరిగింది.
ఎక్కడ చూసినా శిలారూపాలుగా ఈ దేవతలందరూ వరుసగా కనిపిస్తూ ఉన్నప్పటికీ, ఎవరికి వారు ప్రత్యేకమైన వాహనాన్ని కలిగివుంటారు. 'హంస' వాహనంపై బ్రహ్మణ ... 'గరుడ' వాహనంపై వైష్ణవి ... 'వృషభ' వాహనంపై మహేశ్వరీ ... 'నెమలి' వాహనంపై కౌమారి ... 'మహిష' వాహనంపై వారాహి ... 'గజ' వాహనంపై ఇంద్రాణి ... 'శవ' వాహనంపై చాముండి దర్శనమిస్తూ వుంటారు. వీరిని దర్శించుకోవడం వలన సకల జయాలు కలుగుతాయని చెప్పబడుతోంది.