అనేక విశేషాల నిలయం ఈ ఆలయం
సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు ... లోకంలోని సమస్త జీవరాశులపై కాంతి కిరణాలను సమాన స్థాయిలో ప్రసరింపజేస్తాడు. అడగకుండానే ఆహారాన్నీ ... ఆరోగ్యాన్ని ... నిరంతర చైతన్యాన్ని అందజేస్తుంటాడు. ఎన్నో ప్రసాదిస్తోన్న ఆయన ఒక్క నమస్కారంతో సంతృప్తి చెందుతూ వుండటం విశేషం. అందుకే ప్రాచీనకాలం నుంచి ఆయనని ప్రత్యక్ష నారాయణుడిగా భక్తులు ఆరాధిస్తూ వస్తున్నారు.
సాధారణంగా సూర్య కిరణాలు సోకిన ఆలయాలే అత్యంత విశిష్టమైనవిగా చెప్పబడుతుండగా, ఇక సూర్యుడే కొలువుదీరిన ఆలయాలు ఎంతటి వైభవాన్ని సంతరించుకుని విలసిల్లుతూ ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అద్వితీయంగా చెప్పబడుతోన్న అలాంటి సూర్యభగవానుడి ఆలయం అనంతపురం జిల్లా 'బూదగవి' లో దర్శనమిస్తుంది. 13 వ శతాబ్దంలో చోళ రాజులు నిర్మించినట్టుగా చెప్పబడుతోన్న ఈ ఆలయం, సూర్య భగవానుడి ఆలయాలలో అత్యంత విశిష్టమైనదిగా చెప్పబడుతోంది.
లోకాలకు వెలుగును ప్రసాదిస్తూ ఉన్నట్టుగా స్వామివారు గర్భాలయంలో దర్శనమిస్తూ వుంటాడు. తూర్పు దిశగా కాకుండా దక్షినాభిముఖంగా ఆయన కొలువై వుండటం ఇక్కడి విశేషం. ఇక స్వామివారి శిరస్సు భాగంపై బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చిహ్నాలు ఉండటం మరో విశేషంగా చెబుతుంటారు. విశాలమైన నేత్రాలతో ... కోటేరు ముక్కుతో ... సన్నని మీసకట్టుతో ఆయన మూలమూర్తి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది.
సూర్యుడి దగ్గరే సమస్త విద్యలను అభ్యసించిన హనుమంతుడు ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తూ కనిపిస్తూ ఉండటం మరో ప్రత్యేకత. హనుమంతుడు అందరికీ మరింత దగ్గరవాడిగా అనిపిస్తూ వుంటాడు గనుక, ఆయనని ఇలా చూడగానే ఆత్మీయత ఆవిష్కరించబడిన అనుభూతి కలిగుతుంది. సూర్య భగవానుడి సమక్షంలో ... సన్నిధిలో జరిగే యజ్ఞ యాగాలకు ... జపతపాలకు ... దాన ధర్మాలకు విశేషమైన ఫలితం లభిస్తుందని చెప్పబడుతుంది.
అందువలన వివిధ ప్రదేశాల నుంచి ఇక్కడికి చేరుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. గ్రహ సంబంధమైన దోషాలు గలవారు ... వాటి కారణంగా కలిగిన చర్మ సంబంధిత వ్యాధులతో బాధలు పడుతోన్న వాళ్లు స్వామివారి అనుగ్రహాన్ని ఆశిస్తూ ఇక్కడికి వస్తుంటారు ... సంతోషంతో ఆయనను సేవించుకుని సంతృప్తితో తిరిగి వెళుతూ వుంటారు.