పుణ్యక్షేత్రాల్లో ఈ విషయం మరచిపోకూడదు
పుణ్యక్షేత్రాలకి వెళ్లినప్పుడు ముందుగా దైవదర్శనం ఎప్పుడు అవుతుందా అని అంతా ఆత్రుతగా వుంటారు. దైవదర్శనం కోసం చాలాసేపుగా నిరీక్షించిన భక్తులు, దర్శనంకాగానే తేలికగా ఊపిరి పీల్చుకుంటారు. ఇక అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికీ, వివిధ విశేషాలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఆసక్తిని చూపుతారు.
అక్కడి జలపాతాలలోను ... తీర్థాలలోను స్నానం చేయడానికి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ వుంటారు. మరికొందరు అక్కడి గుహలు ... సొరంగ మార్గాలపై దృష్టి పెడుతుంటారు. ఇంకొందరు ప్రకృతి అందాలను కెమెరాలో బంధిస్తూ మున్ముందుకు పోతుంటారు. నిజానికి ఈ విషయాల్లో ఏ మాత్రం కాస్త జాగ్రత్తగా వ్యవహరించకపోయినా ఆనందం స్థానంలో ఆవేదన మిగిలే ఆవకాశం లేకపోలేదు.
జలపాతం చూడటానికి ఎంతో అందంగా వుంటుంది ... అలాగని చెప్పేసి దాని కింద స్నానం చేయకూడదు. ఒక్కోసారి ప్రవాహంలో కొట్టుకువచ్చే దుంగలు ... రాళ్లు పైనుంచి నీటితో పాటే పడిపోవడం జరుగుతుంటుంది. ఇక కొండకోనల్లోని తీర్థాల లోతు ఎంత వుందో తెలుసుకోకుండా లోపలికి దిగకూడదు. అలాగే లోపల ఏముందో తెలుసుకోవాలనే ఆసక్తితో, అక్కడ కనిపించే గుహల్లోకి ... సొరంగ మార్గాల్లోకి వెళ్లడానికి ప్రయత్నించకూడదు.
ఇక ప్రకృతిని కెమెరాలో బంధించాలనే ఆలోచనతో బృందానికి దూరంగా ఒంటరిగా వెళ్లకూడదు. ఇలా అన్ని విషయాల పట్ల జాగ్రత్తగా వుంటే, క్షేత్రదర్శనం అనేది ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. నిజానికి దేవస్థానం వాళ్లు ఇలాంటి విషయాలపట్ల రక్షణ వలయాలను ఏర్పాటు చేస్తూనే వుంటారు ... హెచ్చరికలు రాసిపెడుతూనే వుంటారు. కానీ అత్యుత్సాహంతో ఆ పరిధిని దాటితే ఫలితాన్ని అనుభవించక తప్పదనే విషయాన్ని మరచిపోకూడదు.