స్థిరమైన ఆరోగ్యం కోసం ఏం చేయాలి ?
ఆరోగ్యమే మహాభాగ్యమని ఎందుకన్నారనేది అనారోగ్యం వస్తేనేగాని అర్థంకాదు. సాధారణంగా సంపాదించే వయసు వచ్చేసరికి, సమాజంలో ధనానికి ఎంతటి ప్రాధాన్యత ఉందనేది అర్థమవుతుంది. దాంతో సంపాదనకి సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తూ, ధనంవెంట పరుగులు తీయడం మొదలవుతుంది. సంపాదనే లక్ష్యంగా కనిపిస్తోన్న కారణంగా, ఆకలి ... ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోవడం జరగదు.
ఫలితంగా లేని డబ్బు చేకూరుతుందిగానీ, ఉన్న ఆరోగ్యం చెడిపోతుంది. అప్పుడు కష్టపడి సంపాదించినదంతా అనారోగ్యంతో బాధపడుతూ ఖర్చుచేయవలసి వస్తుంది. అన్నీ సమకూర్చుకుని విస్తట్లో వడ్డించుకుందామని అనుకుంటూ వుండగా అజీర్తివ్యాధి మొదలవుతుంది. అందుకే సంతృప్తికి మించిన సంపదలేదని పెద్దలు చెబుతుంటారు. ఇక వచ్చిన అనారోగ్యం ఎలాగో వచ్చింది ... దాని బారి నుంచి బయటపడటం ఎలాగోనని అంతా ఆందోళన చెందుతూ వుంటారు. అలాంటి వాళ్లందరికీ ఆధ్యాత్మిక గ్రంధాలు ఒక పరిష్కార మార్గాన్ని సూచిస్తున్నాయి.
ఆరోగ్యం స్థిరంగా ఉండాలంటే .. ప్రతినిత్యం సూర్యభగవానుడిని జిల్లేడు పూలతో పూజించాలని చెప్పబడుతోంది. సాధారణంగా గ్రహ సంబంధమైన దోషాల కారణంగానే వ్యాధులు పట్టిపీడిస్తూ వుంటాయి. అలాంటప్పుడు ఒక్కో గ్రహాన్ని ఒక్కో రకమైన పూలతో పూజించడం వలన అవి శాంతిస్తాయని శాస్త్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో సూర్యుడిని ఆయనకి ఎంతో ప్రీతికరమైన జిల్లేడు పూలతో పూజించాలని అంటోంది. ఈ విధంగా చేయడం వలన సూర్యగ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోయి, స్థిరమైన ఆరోగ్యం లభిస్తుందని చెప్పబడుతోంది.