దోషాలను తొలగించే దివ్య తీర్థం ఇదే !
భైరవకోన అనే పేరు వినగానే అక్కడ చోటుచేసుకునే మహిమలు ... ఆసక్తికరమైన సంఘటనలు ఎన్నో ఉంటాయనే ఆలోచన కలుగుతుంటుంది. ప్రకాశం జిల్లా పరిధిలో గల ఈ అడవీప్రాంతం అలాంటివాటికి నిలయంగా కనిపిస్తూ వుంటుంది. ఎటుచూసినా దట్టమైన చెట్లు ... కొండలపై నుంచి దూకే జలపాతాలు ... కాళ్లకి అడ్డుపడతాయేమో అనిపించేలా చిన్న చిన్న పిల్ల కాలువలు కనిపిస్తుంటాయి ... వివిధ రకాల జంతువుల అరుపులు వినిపిస్తుంటాయి.
సూర్యుడి వెలుగు సోకనీయకుండా పరచుకున్న ఈ అడవిలోకి అడుగుపెడుతూ వుంటే, మరో ప్రపంచంలోకి ప్రవేశిస్తోన్న అనుభూతి కలుతుంటుంది. అలాంటి ఈ అడవిలో అమ్మవారితో పాటు పరమశివుడు వివిధ లింగరూపాలలో దర్శనమిస్తూ వుంటాడు. భైరవుడు క్షేత్రపాలకుడిగా వ్యవహరించే ఈ క్షేత్రంలో ఒకప్పుడు మహర్షులు ... మునులు ... సిద్ధులు జపతపాలు ఆచరించినట్టు చెబుతారు. ఆనాటిదిగా చెప్పబడుతోన్న దివ్యతీర్థం ఒకటి ఇక్కడ కనిపిస్తూ వుంటుంది.
ఈ దివ్య తీర్థంలో స్నానం చేయడం వలన దీర్ఘకాలిక వ్యాధులు తగ్గిపోతాయనీ, దోషాలు తొలగిపోతాయని చాలామంది భావిస్తుంటారు. ఎంతో పవిత్రతను పాటిస్తూ ఈ దివ్య తీర్థాన్ని తాకాలని అంటుంటారు. ఈ కారణంగా కొందరు దీక్షను చేపట్టి మరీ ఈ తీర్థంలో స్నానం చేస్తుంటారు. చీకటిపడితే ఇక్కడి వాతావరణం మరింత భయపెడుతుంది కాబట్టి, ఉదయం నుంచి సాయంత్రంలోగానే భక్తులు ఈ తీర్థంలో స్నానం చేసి ... స్వామివారిని దర్శిస్తుంటారు. తనపై గల ప్రేమతో వచ్చిన భక్తులను ఆ దేవదేవుడు కూడా అంతే జాగ్రత్తగా అడవి దాటిస్తుంటాడు.