బాబాను పరీక్షించిన భక్తుడు !
శిరిడీలో వాళ్లంతా నానావళిని బాగా ఎరుగుదురు. నానావళి శిరిడీలో అదే పనిగా తిరుగుతూ అందరికీ ఏవో సూచనలు చేస్తూ ఉండేవాడు. కొంతమంది ఆయనకి మతిభ్రమించినదని అనుకోగా, మరికొందరు ఆయన మాటల్లో లోతైన అర్థం దాగి ఉంటుందని అనుకుంటూ ఉండేవాళ్లు.
ఇక ఒక్కోసారి ఆయన బాబా మశీదు దగ్గరికి కూడా వస్తూ ఉండేవాడు. నిత్య జీవితం సాఫీగా సాగిపోవడానికి అవసరమైన కోరికలు కోరడానికి బాబా కోసం ఎదురు చూస్తున్న వాళ్లపట్ల ఆయన అసహనాన్ని వ్యక్తం చేసేవాడు. అవసరాలు తీర్చే యంత్రంగా బాబాను చూస్తున్నారంటూ మండిపడేవాడు. దాంతో నానా అంటే కొంతమందికి కోపంగా ఉండేది.
ఒక రోజున బాబా తన గద్దెపై కూర్చుని సహచరులతో మాట్లాడుతూ ఉండగా నానా అక్కడికి వస్తాడు. వస్తూనే గద్దెపై నుంచి లేవమని బాబాతో కోపంగా అంటాడు. బాబా అక్కడి నుంచి లేవగానే నానా కూర్చుని బాబాను కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. బాబా వాటన్నింటికీ వినయంగా సమాధానం చెబుతాడు. చూసేవాళ్ళందరికీ ఇది విచిత్రంగా అనిపిస్తుంది. నానావళి అక్కడి నుంచి వెళ్లిపోయిన తరువాతే బాబా అక్కడ కూర్చుంటాడు.
నానావళి ధోరణి పట్ల అక్కడున్న వాళ్లంతా అసనహాన్ని ప్రదర్శిస్తారు. బాబా అనుమతిని ఇస్తే నానా ధోరణిని అడుపుచేస్తామని అంటారు. నానావళి తప్పుగా ఏమీ ప్రవర్తించలేదని బాబా అనడంతో వాళ్లంతా ఆశ్చర్యపోతారు. తన కోసం వస్తోన్న భక్తుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో, తనలో అహంకారం పెరిగిందేమోనని తనని నానా పరీక్షించాడనీ ... తనలో అహంకారం పెరగలేదనే విషయాన్ని తన సమాధానాల వలన తెలుసుకుని వెళ్లిపోయాడని అంటాడు బాబా. మొదటిసారిగా నానావళి గొప్పతనం గురించి వాళ్లకి తెలుస్తుంది ... బాబాతో ఆయనకి గల అనుబంధం గురించి అర్థమవుతుంది.