తులసిదళాలు కోసేందుకు చదివే శ్లోకం
తులసిమొక్క గల గృహాలు పవిత్రంగా అనిపిస్తుంటాయి ... తులసిమొక్కను పూజించేవాళ్లు పద్ధతిగా కనిపిస్తుంటారు. ఎందుకంటే తులసి అనే పేరులోనే పవిత్రత ధ్వనిస్తూ ఉంటుంది. తనని ఆరాధించే ప్రతి ఒక్కరినీ అది ప్రభావితం చేస్తూ ఉంటుంది. తులసికోటను కొంతమంది ప్రధాన గుమ్మానికి ఎదురుగా ఉంచుతుంటారు. మరికొందరు పెరటి గుమ్మానికి ఎదురుగా ఉంచి పూజిస్తుంటారు. మహాపతివ్రత అయిన 'బృందాదేవి' తులసిగా ఆవిర్భవించినట్టు పురాణాలు చెబుతున్నాయి. శ్రీమహావిష్ణువు ... లక్ష్మీదేవి తులసికోటలో నివాసముంటారని స్పష్టం చేస్తున్నాయి.
తులసిని పూజించడం వలన ఆ మహాపతివ్రత ఆశీస్సులు లభిస్తాయి ... లక్ష్మీనారాయణుల దీవెనలు దక్కుతాయి. అనేక వ్యాధులను నివారించే దివ్యమైన ఔషధంగా ప్రసిద్ధి చెందిన తులసి, దుష్టశక్తులను దూరంగా తరిమికొడుతూ ఉంటుంది. ఇంతటి విశిష్ట గుణాలను కలిగిన తులసితో దైవాన్ని పూజించినప్పుడే పరిపూర్ణమైన ఫలితం లభిస్తుందని అందరూ విశ్వసిస్తూ ఉంటారు. అలాంటి తులసిని పరిశుద్ధులై పవిత్రంగానే కోయాలని శాస్త్రం చెబుతోంది. సకలచరాచర సృష్టిని పాలించే పరమాత్ముడి కోసమే కోస్తున్నట్టుగా తులసికి విన్నవించి దళాలను కోయాలి.
అలా కోస్తూ ... '' తులస్యమృత జన్మాని సదా త్వం కేశవప్రియే !కేశవార్ధంతు నామత్వాం వరదాభవ శోభనే !! త్వ మంగ సంభవై పత్రై: పూజయామి యధాహరిం ! తథాకురు పవిత్రాంగం కలౌమల వినాశనీ !! అనే శ్లోకాన్ని పఠించడం వలన తులసీమాత సంతోషపడుతుందట. స్వామి సేవకు ఉపయోగిస్తున్నారనే ఆనందంతో ఏ రోజుకి ఆ రోజు మరింత గుబురుగా పెరుగుతూ ఉంటుందట. ఈ నియమాన్ని పాటించడం వలన ఎలాంటి దోషాలు లేకుండా పరిపూర్ణమైన పూజా ఫలితం లభిస్తుందనే విషయాన్ని గమనించాలి.