స్త్రీలు సంకల్పం చెప్పుకోవచ్చునా ?
దైవం పట్ల భక్తిని ప్రదర్శించడంలోను ... పూజాభిషేకాలు నిర్వహించడంలోను స్త్రీలు ప్రధానమైన పాత్రను పోషిస్తుంటారు. పురుషులకు భక్తి ఎక్కువగానే ఉన్నప్పటికీ వాళ్లు పూజాది కార్యక్రమాలకు కేటాయించే సమయం చాలా తక్కువనే చెప్పాలి. నిత్యపూజలే కాకుండా నోములు - వ్రతాల పట్ల కూడా వీళ్లు మరింత శ్రద్ధను చూపుతుంటారు.
అయితే పూజకి సంబంధించిన కొన్ని విషయాల దగ్గరికి వచ్చేసరికి స్త్రీలు అలా చేయాకూడదు ... ఇలా చేయకూడదు అని నియమాల పేరుతో కొన్ని రకాల ఆంక్షలు వినిపిస్తుండటం జరుగుతూ ఉంటుంది. దాంతో ఏం చేయాలో ... ఏం చేయకూడదో అనే సందేహాలతో స్త్రీలు సతమతమైపోతుంటారు.
అయితే నియమాల పేరుతో ఈ ప్రచారాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయో ... వాటిలో ఉన్న నిజమెంతో తెలుసుకునే ప్రయత్నం ఎవరూ చేయకపోవడం వలన అవి అలా కొనసాగిపోతుంటాయి. స్త్రీలు సంకల్పం చెప్పుకోవచ్చా లేదా అనే సందేహం తలెత్తడానికి కారణం కూడా ఈ తరహా ప్రచారం జరగడమే. నిజానికి పూజలో భాగంగా సంకల్పంలో తిథి .. వారం .. నక్షత్రం .. కరణం .. యోగం .. రుతువు ... పక్షం .. మాసం .. అయనం .. సంవత్సరం చెప్పుకోవడం జరుగుతుంది.
ఇవన్నీ కూడా భగవంతుడికి గుర్తుచేసున్నట్టుగా చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ తమకి గుర్తున్నాయనీ ... ఒక పద్ధతి గల జీవన విధానాన్ని తాము అనుసరిస్తున్నామని వినయపూర్వకంగా దైవానికి తెలుపడమే సంకల్పంలోని ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తూ ఉంటుంది. ఇంతటి విశిష్టతను కలిగిన సంకల్పాన్ని పురుషులు ... స్త్రీలు ఎవరైనా చెప్పుకోవచ్చును. భగవంతుడికి భక్తి శ్రద్ధలే ప్రధానమనేది ఈ విషయానికి కూడా వర్తిస్తుందని మరిచిపోకూడదు.