శ్రీరంగంలో కొలువైన మరో అమ్మవారి కథ
శ్రీరంగం క్షేత్రం గురించి వినంగానే రంగనాయకస్వామి - గోదాదేవిల ప్రేమ ... పరిణయం గురించిన కథనం కమనీయంగా కళ్లముందు కదలాడుతుంది. మనోహరమైన ఆ దృశ్యాలు మనసు వాకిట్లో మళ్లీ మళ్లీ మెదులుతూనే ఉంటాయి. అటు నాచియార్ గా ... ఇటు గోదాదేవిగా ఒక అమ్మవారి కథ వినిపిస్తూ ఉండగా, మరో అమ్మవారిగా ఇక్కడ కమలవల్లి కనులముందు దర్శనమిస్తూ ఉంటుంది.
అటు చోళకులవల్లిగా ఇటు కలమలవల్లిగా కనిపించే ఈ అమ్మవారి గురించి కూడా ఆసక్తికరమైన కథ వినిపిస్తూ ఉంటుంది. చోళరాజైనటువంటి కులశేఖరుడికి ఓ కొలనులోని కమలాల మధ్య ఓ ఆడశిశువు లభిస్తుంది. ఆ శిశువుకి కమలవల్లి అనే నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచి పెద్దచేస్తాడు. కమలవల్లి జాతకాన్ని చూసిన పండితులు, ఆమె సాధారణ యువతి కాదనీ, కారణజన్మురాలని తేల్చేస్తారు.
యుక్త వయసులోకి వచ్చిన కమలవల్లి ఒకసారి శ్రీరంగనాథస్వామిని దర్శిస్తుంది. ఆ మనోహర మూర్తికి మనసును అంకితం చేసి, ఆయననే వివాహమాడవలెనని నిర్ణయించుకుంటుంది. నిద్రాహారాలు మానేసి నిరంతరం ఆ స్వామి గురించే ఆలోచన చేస్తుంటుంది. విషయం తెలుసుకున్న రాజు తన కూతురి మనోభీష్టం నెరవేర్చమని రంగనాథుడిని ప్రాధేయపడతాడు. దాంతో రంగనాథస్వామి ప్రత్యక్షమై కమలవల్లిని తన అర్థాంగిగా స్వీకరించి తనలో ఐక్యం చేసుకుంటాడు.