కష్టాలను కడతేర్చే కన్నయ్య క్షేత్రం
శ్రీకృష్ణుడు అందగాడు .. అల్లరివాడు .. అంతకుమించి అందరిపట్ల ప్రేమానురాగాలు ఉన్నవాడు. అందుకే బాల్యం నుంచి అవతార పరిసమాప్తి వరకూ శ్రీకృష్ణుడు ఒంటరిగా ఎక్కడా కనిపించడు. ఆడుతూ పాడుతూ అందరినీ కలుపుకుపోతూ మాత్రమే కనిపిస్తాడు. ఇక ఆనాటి గోకులం శ్రీకృష్ణుడి వేణుగానం విని తరించింది. గోవులను ... గోపాల బాలకులను ఆ వేణుగానం మంత్రముగ్ధులను చేసేది.
కృష్ణుడి జాడను ఆ వేణుగానం తెలుపుతూ ఉండటంతో అంతాకూడా అక్కడికి ఉత్సాహంగా ... ఊరేగింపులా వెళ్లేవాళ్లు. వేణువు ఊదుతోన్న కృష్ణుడి చుట్టూచేరి తమని తాము మరిచిపోయే వాళ్లు. అలా వేణువు పట్టిన శ్రీ కృష్ణుడి ప్రతిమను చూసినప్పుడు కూడా అలాంటి అనుభూతే కలుగుతూ ఉంటుంది. ఈ తరహా కృష్ణుడు చాలా ఆలయాల్లో దర్శనమిస్తూ ఉన్నప్పటికీ, మహబూబ్ నగర్ లో గల వేణుగోపాల స్వామి మరింత ప్రత్యేకతతో దర్శనమిస్తూ ఉంటాడు.
సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయంలోకి అడుగుపెడుతూ ఉంటే, ఆనాటి బృందావనంలోకి ప్రవేశిస్తూ ఉన్నట్టుగానే అనిపిస్తుంది. పాలరాతితో మలచబడిన ఇక్కడి మూలమూర్తి, అద్భుతమైన సౌందర్యాన్ని ఆవిష్కరిస్తూ ఉంటుంది. ఇంతటి మనోహరమైన రూపం కనుకనే ఆనాటి గోకులం ఆయనని విడిచి ఉండలేకపోయిందని అనిపిస్తుంది. సుందరమైన ... సుకుమారమైన ఆ విగ్రహాన్ని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది.
కృష్ణా అని అంటే కష్టాలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి. అందువలన ఆయనని దర్శించి తమ కష్టాలు చెప్పుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ప్రశాంతతకు ప్రతిరూపంలా కనిపించే ఈ ఆలయంలో అనునిత్యం శ్రీకృష్ణుడి భజనలు కొనసాగుతూ ఉంటాయి. సామూహికంగా జరిగే ఈ భజనల్లో పాల్గొనడం భక్తులకు ఎంతో సంతోషాన్ని ... సంతృప్తిని ఇస్తుంది.