ఉజ్జయినిలో ఊహకందని విచిత్రం !
అక్షర జ్ఞానంలేని కాళిదాసు అనేక అవమానాలను పొందుతూ ఉంటాడు. చివరికి ఒక రోజున కాళికాదేవి విగ్రం ఎదుట కూర్చుని తనకి జ్ఞానాన్ని ప్రసాదించమని పట్టుపడతాడు. అతని అమాయకత్వానికీ ... అంకితభావానికి మురిసిపోయిన అమ్మవారు అపారమైన జ్ఞాన సంపదను అనుగ్రహిస్తుంది. ఫలితంగా కాళిదాసు ... మహాకవి కాళిదాసుగా చరిత్రలో నిలిచిపోయాడు.
ఇంతటి మహిమాన్వితమైన సంఘటనకు వేదికగా నిలిచిన 'ఉజ్జయిని'లో మరో విచిత్రమైన సంఘటన ఈనాటికీ కనిపిస్తూ ఉంటుంది. పురాణపరమైన ... చారిత్రకపరమైన విశిష్టతను సంతరించుకున్న ఈ క్షేత్రంలో కాలభైరవుడి మూర్తి కూడా కొలువై కనిపిస్తూ ఉంటుంది. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న భక్తులు తప్పనిసరిగా కాలభైరవుడిని కూడా దర్శించుకుంటూ ఉంటారు.
ఇక్కడి కాలభైరవుడి సన్నిధిలో తాంత్రిక పూజలు జరుగుతుంటాయి. ఈ సమయంలో కాలభైరవుడికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. స్వామివారి విగ్రహం నోటి దగ్గర మద్యం సీసా పెట్టగానే అందులోని మద్యం క్షణాల్లో ఖాళీ అవుతుంది. సీసాల్లోని మద్యం స్వామి తాగడంలో నిజంలేదని నిరూపించడానికి కొంతమంది ప్రయత్నించినా ప్రయోజనం లేకుండాపోయింది. ఈ కారణంగానే ఇక్కడ కాలభైరవుడు ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడని చెబుతుంటారు. ఆయన అనుగ్రహాన్ని ఆశిస్తూ దర్శిస్తుంటారు.