సూర్య చంద్రులను ఏ రోజున పూజించాలి ?
పురాణాలు ముక్కోటి దేవతలను గురించి ప్రస్తావిస్తూ ఉన్నప్పటికీ వారిలో ఎవరూ కూడా కంటికి కనిపించరు. ఒక్క సూర్యుడు మాత్రమే సమస్త లోకాలకు వెలుగునిస్తూ కనిపిస్తాడు. అందువల్లనే ఆయన ప్రత్యక్ష నారాయణుడిగా ప్రాచీనకాలం నుంచి పూజలు అందుకుంటున్నాడు. సాక్షాత్తు నారాయణమూర్తి స్వరూపంగా భావించబడుతూ, సూర్యనారాయణమూర్తిగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు.
ఇక సూర్యాస్తమయం తరువాత చీకట్లో జీవకోటిపడే అవస్థలను తరిమికొట్టడానికి చంద్రుడు రంగంలోకి దిగుతాడు. అసమానమైన తన భక్తి శ్రద్ధలతో సాక్షాత్తు శివుడి శిరస్సుపైనే స్థానం సంపాదించుకున్న ఘనత చంద్రుడుకే దక్కుతుంది. నవగ్రహాలలోను చంద్రుడు తనదైన పాత్రను ... ప్రత్యేకతను అద్భుతంగా ఆవిష్కరిస్తూ ఉంటాడు. అలా అనంతమైన ఈ సృష్టి కార్యంలో సూర్యచంద్రులు కీలకమైన పాత్రను పోషిస్తూ ఉంటారు.
ఇంతటి కార్యభారాన్ని నిర్వహిస్తున్న సూర్యచంద్రులకు సమస్త మానవాళి రుణపడి ఉందనడంలో ఎలాంటి సందేహంలేదు. అలాంటి సూర్యచంద్రులు ఆవిర్భవించినది ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజునే అని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజునే అతిథి గర్భాన సూర్యుడు ... అనసూయ గర్భాన చంద్రుడు జన్మించారు. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజుగా చెప్పబడుతోన్న సూర్యచంద్రుల పుట్టిన రోజున వీరిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి.
ఈ రోజున ఉదయం వేళలో సూర్యుడిని ... సాయంత్రం వేళలో చంద్రుడిని ఆరాధిస్తూ, ఉపవాస దీక్షను చేపట్టి జాగరణ చేయాలి. ఈ విధమైన నియమాలతో సూర్యచంద్రులను ఆరాధించడం వలన ఆయురారోగ్యాలు ... అష్టైశ్వర్యాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.