తడిబట్టలతో పూజ చేయవచ్చా ?
పూర్వజన్మ పాపాలను నశింపజేసేదే పూజ అని శాస్త్రం చెబుతోంది. ఆధ్యాత్మిక మార్గంపట్ల ఆసక్తి ఉన్నవాళ్లు ప్రతి నిత్యం రెండు పూటలా పూజ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కొందరు ఇష్ట దేవతలను ... మరి కొందరు కులదేవతలను ఆరాధిస్తుంటారు. తననీ ... తనని నమ్ముకున్న వాళ్లని చల్లగా చూడమని కోరడమే పూజలోని ఆంతర్యంగా కనపడుతుంటుంది.
ఇక కాస్త పరిపక్వత కలిగిన వాళ్లు ''పాలముంచినా .. నీట ముంచినా నీదే భారం'' అని అన్నీ దైవానికే వదిలేస్తుంటారు. ఎవరు దేనిని ఆశించి పూజ చేస్తున్నా అందుకు కొన్ని నియమాలను మాత్రం తప్పనిసరిగా పాటించవలసిందేనని శాస్త్రం చెబుతోంది. పూజ ప్రారంభించిన దగ్గర నుంచి అది పూర్తి చేసేంత వరకూ ప్రతిదీ ఒక నియమంగానే భావించాలి. అలాంటి నియమాలలో ఒకటిగా వస్త్రధారణ కనిపిస్తుంది.
చాలామంది ఉదయాన్నే స్నానంచేసి, పరిశుభ్రత పేరుతో తడిబట్టలు కట్టుకుని పూజ చేస్తుంటారు. ఈ విధంగా తడిబట్టలతో పూజ చేయడాన్ని శాస్త్రం దోషంగా చెబుతోంది. పూజ చేసేటప్పుడు తడి వస్త్రం వంటిపై ఉండకూడదని శాస్త్రం చెబుతోంది. తడి వస్త్రం ధరించడంకానీ ... భుజాన వేసుకోవడంకాని చేయకూడదని అంటోంది. ఉదయాన్నే స్నానం చేసి పరిశుభ్రమైన పొడి వస్త్రాలు ధరించి పూజచేయాలి. ఈ విధమైన నియమాన్ని ఆచరిస్తూ పూజచేయడం వలన దోష రహితమైన ఫలితం లభిస్తుందని చెప్పబడుతోంది.