ఏ రోజుల్లో ప్రయాణం చేయకూడదు ?
జీవితమే ఒక ప్రయాణమైతే ... ఆ ప్రయాణంలో భాగంగా మరెన్నో ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది. చదువు కోసం ... ఉద్యోగం కోసం ... వివాహాది శుభకార్యాల నిమిత్తం ... దైవ దర్శనం కోసం ఇలా ఎన్నో కారణాలపై ఒకచోటు నుంచి మరోచోటుకి ప్రయాణం చేయవలసి ఉంటుంది.
ఎలాంటి ప్రయాణ సౌకర్యాలు లేని రోజుల్లోనే పూర్వీకులు ఆగకుండా ప్రయాణాలు చేశారు. అలాంటిది ఇన్ని రకాల ప్రయాణ సౌకర్యాలు ఉండటంతో, ఈ రోజుల్లో ప్రయాణం చేయవలసి రావడాన్ని ఎవరూ కూడా పెద్ద సమస్యగా భావించడం లేదు. అనుకున్నదే తడవుగా బస్సు .. కారు .. రైలు .. విమానం .. ఇలా ఎవరి వీలును బట్టి వాళ్లు ... ఎవరి స్తోమతను బట్టి వాళ్లు తమ ప్రయాణాలను కొనసాగిస్తున్నారు.
ఇక ఈ ప్రయాణాల విషయానికి వచ్చే సరికి కొంతమంది మంచి ముహూర్తాలు చూసుకుని బయలుదేరుతుంటారు. మరికొంతమంది ఈ విషయాలకు పెద్దగా ప్రాముఖ్యతను ఇవ్వకుండా సిద్ధమైపోతుంటారు. ఇక ముహూర్తాల పట్ల కొంతమందికి నమ్మకం ఉన్నా పిల్లలు తొందరపడుతూ ఉంటే కాదనలేక చూసీ చూడనట్టుగా వదిలేస్తుంటారు. అయితే ప్రయాణం ఏదైనా ... ఎక్కడికైనా మంచిరోజు చూసుకుని వెళ్లడమే మంచిదని శాస్త్రం చెబుతోంది.
మంగళవారం ... శనివారం మినహా మిగతా రోజుల్లో ప్రయాణాలు చేయవచ్చని అంటోంది. మంగళ - శనివారాలు ప్రయాణానికి ఏ రకంగాను అనుకూలమైనవి కావు గనక, ఆ రోజుల్లో చేయవలసిన ప్రయాణాలను వాయిదా వేసుకోవడమే మంచిదని చెబుతోంది. తప్పని సరి పరిస్థితి అయితే ముందురోజునే ఆయా ప్రాంతాలకు చేరుకొని, అనుకున్న కార్యాన్ని మరునాడు పూర్తిచేయవచ్చని స్పష్టం చేస్తోంది.