ఇంటి ఆవరణలో నిమ్మచెట్టు ఉండవచ్చునా ?
సాధారణంగా చాలామంది తమ ఇంటి ఆవరణలో వివిధ రకాల మొక్కలను ... చెట్లను పెంచుతుంటారు. ఇంటి ఆవరణలో కూరగాయ మొక్కలు ... పూల మొక్కలతో పాటు, మామిడిచెట్టు ... సపోటాచెట్టు ... జామచెట్టు వంటివి కూడా పెంచుతుంటారు. ఇవి తక్కువ ప్రదేశాన్ని ఆక్రమించి ఎక్కువ నీడను ఇస్తూ ఉంటాయి. అంతే కాకుండా కుటుంబానికి అవసరమైన ఫలాలను ఇస్తాయి.
ఇక ఈ చెట్ల మీదుగా వచ్చే గాలి ఆరోగ్యాన్ని ... ఆహ్లాదాన్నికూడా ఇస్తుంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది తమ ఇంటి ఆవరణలో నిమ్మ చెట్టును పెంచుతుంటారు. నిమ్మచెట్టు గాలిలో గల కాలుష్యాన్ని నివారించి స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. అంతే కాకుండా ఉష్ణోగ్రతను నియంత్రించే విషయంలో కూడా ఇది ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. ఇక గ్రామదేవతల ప్రధానమైన అలంకారం నిమ్మకాయలే.
నిమ్మచెట్లు దిష్టి తగలనీయకుండా కాపాడతాయని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. ఈ కారణంగానే నిమ్మచెట్లు ఇంటి ఆవరణలో పెంచడానికి ఆసక్తిని చూపుతుంటారు. మరి కొందరు నిమ్మచెట్లు పెంచడానికి అయిష్టతను వ్యక్తం చేస్తుంటారు. ముళ్లుగల చెట్లను ఇంటి ఆవరణలో పెంచకూడదని శాస్త్రం చెబుతూ ఉండటమే ఇందుకు కారణం.
ఈ నేపథ్యంలో అసలు నిమ్మచెట్టును ఇంటి ఆవరణలో ఉంచవచ్చా లేదా? అనే సందేహం మిగతా వారికి కలుగుతోంది. అయితే నిమ్మచెట్టు ఒక్కటే ఉండటం వలన దోషం ఉంటుందనీ, దానితో పాటుగా ఇతర మొక్కలను పెంచడం వలన ఆ దోషం వర్తించదని శాస్త్రం చెబుతోంది. కాబట్టి పండ్ల మొక్కలు ... కూరగాయల మొక్కలు పెంచేవారి ఇంటి ఆవరణలో నిమ్మచెట్టు ఉండవచ్చని స్పష్టమవుతోంది.