శివకుటుంబాన్ని పూజిస్తే కలిగే ఫలితం ?
జీవితం సుఖదుఃఖాల మేలుకలయిక. ప్రతి ఒక్కరి జీవితంలోను ఇవి వెలుగునీడల్లా వచ్చి వెళుతూనే ఉంటాయి. కష్టాలు అలుముకున్నప్పుడు కన్నీళ్లతో అందరూ ఆ దైవాన్నే ప్రార్ధిస్తుంటారు. ఈ నేపథ్యంలో కొందరు వైకుంఠవాసుడైన శ్రీహరినీ ... మరికొందరు కైలాసపతి అయిన శివుడిని ... ఇంకొందరు జగజ్జనని అయిన అమ్మవారిని వేడుకుంటూ ఉంటారు. అందరూ వెన్నవంటి మనసున్నవారే ... తమ బిడ్డలవంటి భక్తుల జీవితంలో వెన్నెల వెలుగులు నింపేవారే.
అయితే అనేక ప్రళయాల నుంచి జీవులను కాపాడటంలో శివ కుటుంబానికి చెందినవారిగా శివుడు ... పార్వతీదేవి ... గణపతి ... కుమారస్వామి ప్రధానమైన పాత్రను పోషిస్తూ వచ్చారు. శివ కుటుంబంగా చెప్పబడుతోన్న ఈ నలుగురినీ పూజించడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. సమస్త లోకాలకు తండ్రి శివుడు ... తల్లి పార్వతీదేవి. కష్టాలు తీర్చడంలోను ... కరుణించడంలోను ఆదిదంపతులు అందరికంటే ముందే ఉంటారు.
ఇక వారి సంతానమైన గణపతి ... కుమారస్వామిలలో ఎవరి ప్రత్యేకత వారికి ఉండనే ఉంది. మంచి ఉద్దేశంతో తలపెట్టే కార్యాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా వినాయకుడు చూసుకుంటూ ఉంటాడు. తల్లిదండ్రులకు మించిన దైవం లేదు ... వారికి భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేయడం వలన ముల్లోకాలను చుట్టివచ్చిన ఫలితం దక్కుతుందని ఆచరించి చూపించిన ఘనుడు ... వినాయకుడు.
ఇక 'శక్తి' అనే ఆయుధాన్ని ధరించి దేవతలకు అనేక విజయాలను సాధించి పెట్టినవాడు కుమారస్వామి. తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని పిల్లలుగా నిజం చేసి చూపించాలనే విషయానికి కుమారస్వామి స్పూర్తిగా నిలుస్తాడు. తనని చూసి తన తల్లి ఎంతలా మురిసిపోతుందో తెలుసుకనుక, అదే ఆనందాన్ని అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో సంతానాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు.
శివ కుటుంబంలో స్వామివారి వాహనమైన నంది ... అమ్మవారి వాహనమైన సింహం వైర జాతికి చెందినవి. అలాగే వినాయకుడి వాహనమైన ఎలుక ... శివుడి మెడలోని పాము ... కుమార స్వామి వాహనమైన నెమలి వైర జాతికి సంబంధించినవి. కానీ వీరి సమక్షంలో అవన్నీ ఎంతో సఖ్యతగా ఉంటూ ఉంటాయి. ఈ కారణంగానే ప్రేమానురాగాలకు ... అడుగడుగునా ఆవిష్కరించే ఆదర్శాలకు శివకుటుంబం నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి శివ కుటుంబాన్ని పూజించడం వలన సమస్త పాపాలు నశించి సకల శుభాలు చేకూరతాయి. సంపద ... సౌభాగ్యం ... విజయం ... మోక్షం లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.