అనారోగ్యానికి దూరంగా ఉంచే తులసి

అనారోగ్యానికి దూరంగా ఉంచే తులసి
ప్రాచీనకాలం నుంచి కూడా ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ప్రభావితం చేయడంలో తులసి ప్రధానమైన పాత్రను పోషిస్తూ వస్తోంది. దైవారాధనలో తులసిని ఉపయోగించడం వల్లనే పరిపూర్ణమైన ఫలితం దక్కుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలాంటి తులసి అదే ప్రాచీన కాలం నుంచి అనారోగ్యాలను దూరం చేసే దివ్యమైన ఔషధంగా కీలకమైన పాత్రను నిర్వహిస్తోంది. పగలు - రాత్రి కూడా ప్రాణవాయువును విడుదల చేయగలగడం తులసి ప్రత్యేకతగా చెప్పబడుతోంది.

ఇంతటి విశిష్టతను కలిగిన తులసిని ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. జలుబు .. దగ్గు ... కఫం ... తలనొప్పి ... గొంతునొప్పి ... అజీర్తి ... జ్వరం ... మొదలైన వాటి బారి నుంచి బయటపడేందుకు వాడే ఆయుర్వేద మందుల్లో తప్పనిసరిగా తులసిని ఉపయోగిస్తారు. ఇక తులసి లేత ఆకులను వేడి నీటిలో మరిగించి తాగితే, విష జ్వరాల బారిన పడకుండా రక్షిస్తుంది. ఇక మూత్ర సంబంధిత వ్యాధులు ... శ్వాస సంబంధిత వ్యాధులు హృదయ సంబంధిత వ్యాధులతో పాటు మధుమేహానికి కూడా తులసిని మించిన ఔషధం లేదని పరిశోధనలు చెబుతున్నాయి.

తులసి మొక్కలపై నుంచి వచ్చే గాలే అనేక రకాల వ్యాధి సంబంధిత క్రిములను తరిమేసి ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. తులసి మొక్క పెరట్లో ఉంటే వేల రకాల వ్యాధుల బారి నుంచి కాపాడే వైద్యుడు ఉన్నట్టేనని భావించవలసి ఉంటుంది. ఈ కారణంగానే పూర్వీకులు తులసి మొక్కకు గల ఆధ్యాత్మిక నేపథ్యాన్ని వివరిస్తూ, అనునిత్యం దానిని ఆరాధించేలా చేశారని చెప్పవచ్చు.

More Bhakti Articles