ఆనందాశ్చర్యాలు కలిగించే అరుదైన క్షేత్రం
సాధారణంగా గుడికి వెళ్లాలని అనుకున్నప్పుడు ఉదయాన్నే స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి బయలుదేరడం జరుగుతూ వుంటుంది. ఇక గుడి దగ్గరికి వెళ్లగానే బయట పాదరక్షలు వదిలి లోపలికి వెళ్లడం జరుగుతూ వుంటుంది. అయితే తమిళనాడు - మదురై జిల్లా పరిధిలో గల 'కీళమట్టయాన్' గ్రామంలో గల అంగాళీశ్వరీ - గురునాథస్వామి దర్శనం చేసుకోవాలనుకునే వాళ్లు ఇంకాస్త భక్తి శ్రద్ధలను కలిగి ఉండవలసి వస్తుంది.
పాదరక్షలు ధరించిగానీ ... స్నానం చేయకుండాగాని ఈ గ్రామంలోకి ప్రవేశించకూడదనే నియమం వుంది. ఈ నియమాన్ని గ్రామస్తులు తప్పనిసరిగా పాటిస్తుంటారు. ఇతరులు పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ నియమాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తే తమ దైవాన్ని అవమానపరిచినట్టుగా వాళ్లు భావిస్తారు. మంచి జరిగితే తమ దైవం అనుగ్రహించిందనీ ... చెడు జరిగితే తమ దైవానికి ఆగ్రహం కలిగిందని వాళ్లు విశ్వసిస్తూ వుంటారు.
గ్రామానికి సంబంధించిన ఏ సమస్యలైనా ఆలయ ప్రాంగణంలో ... పూజారి సమక్షంలో పరిష్కరించబడుతుంటాయి. ఇక్కడి దైవ సన్నిధిలో అసత్యం చెప్పడానికి ఎవరూ సాహసించరు. అందువలన సమస్యలు త్వరగా పరిష్కారమవుతూ వుంటాయి. దైవం తమని కనిపెట్టుకుని ఉంటుందని వాళ్లు బలంగా నమ్ముతుంటారు. అందువలన ఆ దైవానికి సంబంధించిన కార్యక్రమాలకు ఎలాంటి లోటు రాకుండా వాళ్లు చూసుకుంటూ వుంటారు.
దైవ సంబంధిత వేడుకను తమ ఇంట్లో జరిగే వేడుకలా ... ఊరు పండుగలా అంతా కలిసికట్టుగా జరుపుకుంటారు. తమ దైవం నుంచి ఆశించిన ఆశీస్సులు అందుకుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించబడిన ఈ క్షేత్రం భక్తిభావ పరిమళాలు వెదజల్లుతూ ఆనందాన్ని కలిగిస్తుండగా, గ్రామస్తుల విశ్వాసాలు మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి.