తమలపాకు చేసే మేలు
శుభకార్యాలు ... దైవకార్యాలు భారతీయుల ఆచార వ్యవహారాలను ఆవిష్కరిస్తూ వుంటాయి. అలాంటి శుభప్రదమైన కార్యక్రమాలకి అవసరమైన సామాగ్రి జాబితా సిద్ధం చేయవలసి వస్తే, అందరూ ముందుగా రాసుకునే పేరు తమలపాకులే. తమలపాకులు లేకుండా ఏ శుభకార్యంగానీ ... దైవకార్యంగాని ప్రారంభించరు. భారతీయుల ఆధ్యాత్మిక జీవిత చరిత్రను వేల సంవత్సరాలుగా ప్రభావితం చేయడంలోనే కాదు, ఆరోగ్య సంబంధిత విషయాల్లోనూ తమలపాకులు ప్రధానమైన పాత్రను పోషిస్తూ వస్తున్నాయి.
ఆరోగ్యపరంగా తమలపాకులు చేసే మేలును గుర్తించే పూర్వీకులు వాటిని ఆధ్యాత్మిక అవసరాల్లో చేర్చారు. పూజలు .. నోములు .. వ్రతాలు .. శుభకార్యాలు .. దైవ సంబంధితకార్యాల్లో తమలపాకులకు ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించారు. పూర్వం భోజనం అనంతరం తప్పనిసరిగా తాంబూలాన్ని స్వీకరించేవారు. ఇప్పుడా అలవాటు కొంతమందిలో మాత్రమే కనిపిస్తూ వుంటుంది.
తమలపాకులోని ఔషధ గుణాలను గుర్తించిన అనేక దేశాలు ఆ పంటకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి. ఇక కొన్ని దేశాల వాళ్లు తమలపాకులను అనునిత్యం వంటల్లో వాడుతూ వుండటం విశేషం. తమలపాకులో పెద్దమొత్తంలో యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నట్టుగా పరిశోధనలు చెబుతున్నాయి. తమలపాకు రసం వలన జలుబు ... దగ్గు ... అజీర్తి కారణంగా వచ్చే కడుపులో నొప్పి తగ్గడమే కాకుండా, నరాల బలహీనత ... మూత్రసంబంధిత వ్యాధులు ... కేన్సర్ వంటి భయంకర వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది.
తాంబూలాన్ని స్వీకరించడం వలన దంత సంబంధిత సమస్యలు ... శరీర దుర్వాసన తొలగిపోతాయి. గాయాలపై తమలపాకు రసం పిండటం వలన వెంటనే ఉపశమనం లభించడమే కాకుండా, చాలా తక్కువ సమయంలో ఆ గాయాలు మానిపోతాయి. అంతే కాకుండా తమలపాకులకి ఆముదం రాసి గోరువెచ్చ చేసి బొబ్బలపై వుంచడం వలన మంచి ఫలితం కనిపిస్తుందని చెప్పబడుతోంది.