తులసి కోట ప్రదక్షిణ ఫలితం
భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానాన్ని తులసి ఎంతగానో ప్రభావితం చేస్తుంటుంది. అందువల్లనే వాళ్లు తులసిని ... తులసమ్మ అంటూ ఆప్యాయంగా పిలుచుకుంటూ వుంటారు. తులసి అనే పేరే పవిత్రతను ఆవిష్కరిస్తూ ... పుణ్యాలను ప్రసాదిస్తూ వుంటుంది. వేలరకాల పూలతో దైవాన్ని పూజిస్తే కలిగే ఫలితం కన్నా ... ఒక్క తులసితో పూజిస్తే కలిగే ఫలితం లక్షరెట్లు అధికంగా వుంటుంది. అందువల్లనే తులసిలేని పూజ ... పూజనేకాదని అంటూవుంటారు.
ఆధ్యాత్మిక భావాలు అణువంత ఉంటేచాలు, ఆ ఇంట్లో తులసికోట తప్పనిసరిగా కనిపిస్తూ వుంటుంది. తులసి మూలంలో సర్వ తీర్థాలు ... తులసి మధ్యభాగంలో సకల వేదాలు ఉంటాయనీ ... తులసి చివరలో సమస్త దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి తులసికి ప్రదక్షిణం చేయడం వలన వేదాలకు ... తీర్ధాలకు ... దేవతలకు ప్రదక్షిణం చేసిన ఫలితం కలుగుతుంది.
ఏ ఇంట్లో అయితే తులసికోట వుంటుందో ... ఏ ఇల్లాలైతే తులసి కోటకు నిత్యం ప్రదక్షిణలు చేస్తుందో ఆ ఇల్లు సిరిసంపదలతో తులతూగుతూ ఉంటుంది. అందుకు కారణం లక్ష్మీనారాయణులు అందులో నివసిస్తూ ఉండటమే. తులసికి ప్రదక్షిణ చేయడం వలన లక్ష్మీనారాయణులను ప్రత్యక్షంగా సేవించిన ఫలితం దక్కుతుంది. ప్రాచీన కాలంలోనే కాదు ... నేటి ఆధునిక కాలంలోను తులసిని అనుదినం పూజించేవారు లేకపోలేదు.
స్త్రీలు ఉదయాన్నే తలస్నానం చేసి తులసిని పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. తులసికోట దగ్గర దీపంపెట్టి ... పువ్వులతో పూజిస్తారు. తులసికి గల వివిధ నామాలను స్మరిస్తూ ప్రదక్షిణలు చేస్తుంటారు. ఈ విధంగా తులసిని సేవించిన ఫలితంగా అనేక జన్మల పాపాలు ... దోషాలు నశిస్తాయి. స్త్రీలు కోరుకునే సంతాన సౌభాగ్యాలు ... ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయని చెప్పబడుతోంది.