జపం చేయడం వలన కలిగే ఫలితం

జపం చేయడం వలన కలిగే ఫలితం
దేవుడు అందరివాడు ... అయితే తనని ఎక్కువగా విశ్వసించిన వారినే ఆయన ఆదరిస్తాడు ... అనుగ్రహిస్తాడు. అనంతమైన ఈ విశ్వంలో ... సుధీర్గమైన ఈ ప్రయాణంలో ఎవరివెంటనైనా చివరివరకూ వుండేది భగవంతుడు మాత్రమే. జీవితంలో అడుగడుగునా అండగా నిలుస్తూ ముందుకు నడిపించేది ... గెలిపించేది ఆయనే. అలాంటి భగవంతుడి మనసు గెలుచుకునే మార్గాలుగా పూజలు .. జపాలు .. దానధర్మాలు కనిపిస్తాయి.

వీటిలో జపానికి గల ప్రాముఖ్యత అంతాఇంతా కాదు. భగవంతుడి పట్ల భక్తిశ్రద్ధలు ... జపానికి ఉపయోగించే మాలలు ... జపం చేసే ప్రదేశాన్ని బట్టి ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతోంది. సాధారణంగా జపానికి తులసిమాలను ఎక్కువగా వాడుతూ వుంటారు. కొందరు పగడాల మాలను ... మరికొందరు ముత్యాల మాలను ఉపయోగిస్తూ వుంటారు. ఈ జపమాలలతో జపం చేయడం వలన విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి.

ఇక తామరపూసల మాలతోను ... రుద్రాక్ష మాలతోను జపం చేయడం వలన కలిగే ఫలితం కోటిరెట్లు ఎక్కువగా ఉంటుందని చెప్పబడుతోంది. జపమాలను వ్రేళ్ల కణుపులపై నుంచి జరుపుతూ జపం చేయడం వలన ఆశించినదాని కన్నా ఫలితం ఎక్కువగా వుంటుంది. జపం చేసుకోవడానికి ప్రశాంతమైన ... పవిత్రమైన ప్రదేశం కావాలి. ఆలయాలలోను ... నదీతీరాలలోను చేసే జపం వలన విశేష పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి.

More Bhakti Articles