తిలచతుర్థి రోజున ఎవరిని పూజించాలి?
దేవుడు ఒక్కడే అయినప్పటికీ ఆయనకిగల రూపాలు ... నామాలు అనేకం. ఇక దేవుడు ఎవరైనప్పటికీ వారిని సాధారణ రోజుల్లో పూజించడం వలన కలిగే ఫలితాలకీ, విశేషమైన రోజుల్లో ఆరాధించడం వలన కలిగే ఫలితాలకి మధ్య ఎంతో తేడా వుంటుంది. విశేషమైనటు వంటి రోజుల్లో ఆయా దేవతలను పూజించడం వలన అనంతమైన పుణ్యఫలాలు ప్రసాదించబడతాయని శాస్త్రం చెబుతోంది. ఈ కారణంగానే ఆయా రోజుల్లో ఆలయాలు భక్తజన సందోహంతో కనిపిస్తుంటాయి. మాఘమాసం లోని 'తిలచతుర్థి' విశేషమైనటు వంటి రోజుగా చెప్పబడుతోంది.
మాఘమాసంలో వచ్చే శుద్ధ చతుర్థిని 'తిలచతుర్థి' అంటారు. దీనినే 'కుంద చతుర్థి' అని కూడా పిలుస్తుంటారు. ఈ రోజున వినాయకుడిని పూజించడం వలన దోషాలు తొలగిపోతాయి. వినాయకుడిని ఆరాధించడమే కాదు ఉపవాస దీక్షను చేపట్టి జాగరణ కూడా చేయవలసి వుంటుంది. ఈ విధంగా చేయడం వలన విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి. ఇక సిరిసంపదలను ఆశించే వారు ఈ రోజున ఉపవాసదీక్షను చేపట్టి పరమశివుడిని 'మొల్ల' పూలతో పూజించాలని శాస్త్రం చెబుతోంది.
సాధారణ రోజుల్లో శివపూజకు మొల్లపూలను ఉపయోగించరు. కానీ ఈ రోజున మొల్ల పూలతోనే శివుడిని అర్చించాలని శాస్త్రం స్పష్టం చేస్తోంది. ఈ రోజున శివుడిని మొల్ల పూలతో పూజించడం వలన, ఆ స్వామి ఆనందంతో పొంగిపోతాడట. సదాశివుడిని సంతోష పెట్టగలిగితే ఆ స్వామి అనుగ్రహం సులభంగా లభిస్తుంది. మొల్లపూలను అభిషేకిస్తూ ఆదిదేవుడిని మెప్పించగలిగితే, భక్తులకు సకలశుభాలు చేకూరతాయి ... వారి ఇంట సిరిసంపదలు నాట్యమాడతాయి.