మాఘమాసం విశిష్టత
అత్యంత పవిత్రమైన మాసాల్లో 'మాఘమాసం' ఒకటిగా చెప్పబడుతోంది. ఈ నెలలో పౌర్ణమి నాటికి 'మఖ' నక్షత్రం వుండటం వలన ఈ మాసానికి మాఘమాసం అనే పేరు వచ్చింది. ఇటు దైవకార్యాలకి ... అటు శుభకార్యాలకి ఈ మాసం విశేషమైనదిగా చెప్పబడుతోంది. మాఘమాసంలో చేసే నదీ స్నానాల వలన ... సూర్యుడి ఆరాధన వలన అనంతమైన పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని శాస్త్రం చెబుతోంది.
మాఘ శుద్ధ చతుర్థిని ' తిల చతుర్థి' అని అంటారు. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి గణపతిని పూజించి జాగరణ చేయడం వలన సకల శుభాలు చేకూరతాయి. చదువుల తల్లిగా పూజలందుకునే సరస్వతీదేవి పుట్టిన రోజు కూడా ఈ మాసంలోనే వస్తుంది. మాఘశుద్ధ పంచమినే 'శ్రీ పంచమి' అని అంటారు. ఈ రోజున వివిధ ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాల్లో 'అక్షరాభ్యాసాలు' విరివిగా జరుగుతుంటాయి. ఇక విద్యార్ధినీ విద్యార్థులు ఉదయాన్నే తలస్నానం చేసి అమ్మవారిని దర్శించుకోవడం వలన ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది.
అత్యంత విశిష్టమైనదిగా చెప్పుకునే 'రథసప్తమి' పర్వదినం ఈ మాసంలోనే వస్తుంది. మాఘశుద్ధ సప్తమిని 'రథసప్తమి' గా చెబుతుంటారు. ఈ రోజున జిల్లేడు ఆకులు తలపై పెట్టుకుని స్నానం చేయడం వలన శివానుగ్రహం - సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తాయని శాస్త్రం చెబుతోంది. ఇక 'భీష్మ ఏకాదశి' గా చెప్పుకునే మాఘశుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని సేవించడం వలన ... ఉపవాస జాగరణలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన సమస్త పాపాలు నశించి పుణ్య ఫలాలు లభిస్తాయి.
ఇక 'మాఘ పౌర్ణమి' మహా విశిష్టమైనదిగా చెప్పబడుతోంది. ఈ రోజున చేసే నదీ స్నానం కానీ ... సముద్ర స్నానం కాని విశేషమైన ఫలితాలను ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున దానం చేయడం వలన కలిగే పుణ్యం జన్మజన్మల పాటు వెంటవస్తుందని స్పష్టం చేస్తున్నాయి. ఇటు ఆధ్యాత్మిక పరమైన పుణ్యఫలాలను ... అటు ఆరోగ్యపరమైన ప్రయోజనాలను కలిగించే మాఘమాసం మానవాళికి లభించిన ఓ మహోన్నతమైన వరమని చెప్పక తప్పదు.