శాపాలు ప్రభావం చూపుతాయా?

శాపాలు ప్రభావం చూపుతాయా?
పూర్వం మునులు ... మహర్షులు తమ ధ్యానానికి ఆటంకం కలిగినప్పుడు అందుకు కారకులైన వారిని శపించినట్టు పురాణాల ద్వారా ... ఇతిహాసాల ద్వారా తెలుస్తుంటుంది. అలాగే పక్షులు ... పాములు సైతం తమ జీవన విధానానికి అడ్డుపడిన వారిని శపించినట్టు ఆధ్యాత్మిక గ్రంధాలలో కనిపిస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే శాపాలు ఫలిస్తాయా అనే సందేహం తలెత్తుతూ వుంటుంది.

సత్య సంధుల శాపాలు వృధాపోవనీ ... అవి జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయని శాస్త్రం చెబుతోంది. భగవంతుడిపై భక్తి శ్రద్ధలు ... సత్యవ్రత ఆచరణ ... నీతి నియమాలతో కూడిన ధరబద్ధమైన జీవితం కొనసాగిస్తున్న వారు కొందరు వుంటారు. వీరు ఏ జీవికి తమ వలన ఎలాంటి హాని కలగకుండా, తమ జీవితాన్ని కొనసాగిస్తూ వుంటారు. అలాంటి వారి మనసుకి కష్టం కలిగించినప్పుడు వాళ్లు ఆగ్రహావేశాలకు లోనవుతారు. ఆ సమయంలో వారి నోటి నుంచి వచ్చే మాటలు నిజమవుతాయి.

అలాగే పూర్వ జన్మ కర్మ ఫలితంగా పక్షులుగా ... పాములుగా జన్మించిన వారు కూడా తమ జీవితాన్ని అతలాకుతలం చేసిన వారిని శపిస్తూ వుంటారు. ఈ శాపాల కారణంగా విద్యలో రాణించలేక పోవడం ... ఉద్యోగం లభించక పోవడం ... వివాహం ఆలస్యం కావడం ... సంతానం కలగకపోవడం వంటివి జరుగుతుంటాయి. సర్పశాపం వలన సంతానం కలగక పోవడం జరిగినట్టే, ఇతరుల శాపాల కారణంగా అనేక కష్టాలు అనుభవించవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా శాపాలకు సంబంధించిన శాంతులు చేయించడం వలన ఫలితం కనిపిస్తుంది.

More Bhakti Articles