అమ్మవారి కుంకుమ ధారణ ఫలితం
ఆదిపరాశక్తి అయిన అమ్మవారు అనేక రూపాలుగా అవతరించి దుష్ట శిక్షణ చేస్తూ వచ్చింది. లోక కల్యాణం కోసం అమ్మవారు అవతరించిన రూపాలలో తొమ్మిది రూపాలు అత్యంత విశిష్టమైనవిగా చెప్పబడుతున్నాయి. వీటిలో ఒక్కో రూపం ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. ఈ తొమ్మిది రూపాలలో గల అమ్మవార్లు అనేక ప్రాంతాల్లో కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు.
సాధారణంగా అమ్మవార్లు కొలువైన ఆలయాలకు మహిళా భక్తులు ఎక్కువగా వస్తూ వుంటారు. శుక్రవారాల్లోను ... విశేషమైన పర్వదినాల్లోను అమ్మవారికి భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజ చేయిస్తూ వుంటారు. ఈ విధంగా అమ్మవారిని పూజించిన కుంకుమను భక్తులు ప్రసాదంతో పాటుగా అర్చకుడి నుంచి అందుకుంటారు. వివాహితులు అమ్మవారి కుంకుమను నుదుటున ... పాపిటలోను ధరిస్తారు.
అమ్మవారిని పూజించిన కుంకుమను ధరించడం వలన, ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది ... సౌభాగ్యం సుస్థిరమౌతుంది. అమ్మవారి కుంకుమను స్త్రీలు అనునిత్యం ధరించడం వలన, ఆమె కృపా కటాక్షాలకు పాత్రులవుతుంటారు. అమ్మవారి కుంకుమను ధరించిన వారికి దుష్ట శక్తులు దూరంగా వుంటాయి. ఇక గ్రహ సంబంధిత దోషాలు కూడా వారిపై ప్రభావం చూపలేవని అంటారు.
ఇంట్లో ఎవరైనా ఒకరు అమ్మవారి భక్తులుగా వుంటే ఇక ఆ ఇంటిని అమ్మవారు కంటికి రెప్పలా కాపాడుతూ వుంటుంది. ఆ కుటుంబ సభ్యులకు శత్రుభయం ... అపమృత్యు భయం లేకుండా చేసి, సిరిసంపదలను ... సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది.