శని దోషాలను తొలగించే దానం

శని దోషాలను తొలగించే దానం
సాధారణంగా శని అనే పేరు వినగానే అందరి మనసులో అలజడి మొదలవుతుంది. ఇక శని దోషం వెంటాడుతోందని తెలియగానే వాళ్లు పడే కంగారు అంతా ఇంతా కాదు. ఆ దోషం నుంచి బయటపడటానికి ఆ క్షణం నుంచే వాళ్లు ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ విషయంలో ఇతరులు ఇచ్చే సలహాలను ... సూచనలను ఆత్రంగా ఆచరణలో పెడుతుంటారు. ఇక శనిదోషం నుంచి బయటపడటానికి ఉప్పు .. నువ్వులు .. నూనె దానంగా ఇస్తుంటారు.

నిజానికి ఈ మూడు పదార్థాలను ఇంట్లో గానీ ... బయటగాని ఒకరి నుంచి ఒకరు నేరుగా అందుకోవడానికి కూడా సాహసించరు. అనారోగ్యాన్ని కలిగించే పదార్థాల జాబితాలో ముందు వరుసలో కనిపించే ఈ మూడు పదార్థాలు శనికారకాలుగా చెప్పబడుతుండటమే అందుకు ప్రధాన కారణం. నిజానికి వీటిని దానంగా గ్రహించడానికి ఎవరూ సిద్ధంగా వుండరు.

అందువలన ఎవరికో ఒకరికి దానంగా ఇచ్చి వదిలించుకుందామని చాలామంది అనుకుంటూ వుంటారు. అందుకోసం ఆర్ధికంగా ఇబ్బందులు పడుతూ జరుగుబాటు కానివారి కోసం వెదుకుతూ వుంటారు. దానాన్ని ఇష్టపూర్తిగా స్వీకరించే వారికే ఇవ్వాలని శాస్త్రం చెబుతోంది. ఎవరైతే దానాన్ని గ్రహించి ఆ దానాన్ని స్వీకరించడం వలన వచ్చే దోషాలకు పరిహారం చేసుకోగలరో వారికే ఇవ్వాలి. అప్పుడే చేసిన దానం వలన ఫలితం వుంటుంది. లేదంటే శనిదానం గ్రహించిన వాళ్లు ఆ కారణంగా బాధలు పడితే, ఆ దోషం కూడా దానం చేసిన వారికే సంక్రమిస్తుందనే విషయాన్ని గ్రహించాలి.

More Bhakti Articles