ముప్పైమూడు కోట్లమంది దేవతలు వీరే
ఏదైనా ఒక సందర్భంలో తన నిజాయితీని నిరూపించుకోవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు, ముప్పైమూడు కోట్లమంది దేవతల సాక్షిగా అని ప్రమాణం చేసి చెబుతుంటారు. ఇలా ఏదో ఒక సందర్భంలో ముప్పై మూడు కోట్లమంది దేవతల ప్రస్తావన వస్తూ వుంటుంది. ఈ ముప్పైమూడు కోట్లమంది దేవతలు సమస్త లోకాలను పరిపాలిస్తూ ఉంటారని అందరూ భావిస్తూ వుంటారు.
అయితే ఈ దేవతల సంఖ్య చూసి వాళ్లు ఎవరనేది తెలుసుకునే సాహసం చాలామంది చేయరు. ముప్పైమూడు కోట్ల మంది దేవతల పేర్లు ఎలాగూ గుర్తుండవు ... కనుక తెలుసుకోవడం అనవసరమని వాళ్లు అనుకుంటూ వుంటారు. నిజానికి ముప్పు మూడు మంది దేవతలను ముప్పై మూడు కోట్ల మంది దేవతలుగా భావిస్తూ వుంటారనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి వుంటుంది.
ముప్పై మూడుమంది దేవతల జాబితాలో అశ్వనీ దేవతలు (ఇద్దరు) ... అష్టవసువులు (ఎనిమిది మంది) ... ఏకాదశ రుద్రులు (పదకొండుమంది) ... ద్వాదశ ఆదిత్యులు (పన్నెండుమంది) దర్శనమిస్తూ వుంటారు. అశ్వనీ దేవతలు ఇద్దరు కాగా, ధరుడు .. ధృవుడు .. సోముడు .. అహుడు .. అనిలుడు .. అగ్ని .. ప్రత్యూషుడు .. భీష్ముడు అష్ట వసువులుగా చెప్పబడుతున్నారు.
ఇక శంభుడు .. పినాకి .. గిరీషుడు .. స్థాణువు .. భర్గుడు .. శివుడు .. సదాశివుడు .. హరుడు .. శర్వుడు .. కపాలి .. భవుడు .. ఏకాదశ రుద్రులుగా పేర్కొనబడ్డారు. ఆర్యముడు .. మిత్రుడు .. వరుణుడు .. అర్కుడు .. భగుడు .. ఇంద్రుడు .. వివస్వంతుడు .. పూషుడు .. పర్జన్యుడు .. త్వష్ట .. విష్ణువు .. అజుడు .. ద్వాదశ ఆదిత్యులుగా చెప్పబడ్డారు. వీళ్లందరూ కలుపుకుని ముప్పై మూడుమంది దేవతలు. వీరిలో ఒక్కో దేవతను కోటి మంది దేవతలతో సమానంగా భావించి పూజిస్తూ వుంటారు. ఈ కారణంగానే ముప్పైమూడు కోట్లమంది దేవతలని చెప్పడం జరుగుతోంది.