దీనస్థితిని తొలగించే దివ్యక్షేత్రం
ఆర్ధికపరమైన సమస్యల కారణంగానే జీవితం అనేక ఒడిదుడుకులకు లోనవుతుంది. అవసరాలు తీరాలన్నా ... ఆపదల నుంచి గట్టెక్కాలన్నా ఆర్ధికపరమైన బలాన్ని కలిగి వుండాలి. లేదంటే దీనస్థితి వ్యవస్థ నుంచి వ్యక్తిని వేరుచేసి ఓడిపోయేలా చేస్తుంది. అలాంటి దీనస్థితిని అనుభవించే వాళ్లు ఒక్కసారి సీతారాములను దర్శించుకుంటేచాలని హైదరాబాద్ - సీతారాం బాగ్ ప్రాంతానికి చెందిన భక్తులు చెబుతుంటారు. ఇక్కడి 'సీతారామ్ మహారాజ్ సంస్థాన్' లోనే మనకి సీతారాములు దర్శనమిస్తూ వుంటారు.
ఇక్కడ ప్రాచీనకాలంనాటి శివాలయం కనిపిస్తుంది. ఆ తరువాత కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిన రామాలయం దర్శనమిస్తుంది. ఇక స్వయంభువుగా అవతరించిన హనుమంతుడు కనిపిస్తాడు. శ్రీరామచంద్రుడికి ... శివుడికి గల అనుబంధం మాటల్లోచెప్పలేనిది. అలాగే శివాంశ సంభూతుడిగా ... రామభక్తుడిగా హనుమంతుడు నిర్వహించిన పాత్రను కూడా మాటల్లో వర్ణించలేం. అలాంటి ఈ ముగ్గురూ దైవాలతో పాటు వరదరాజస్వామి కొలువుదీరిన ఈ క్షేత్రం మహిమాన్వితమైనదిగా అలరారుతోంది.
పొడవైన ప్రాకారాలు ... విశాలమైన మంటపాలు కలిగిన ఈ ఆలయం ప్రాచీనతను ప్రతిబింబిస్తూ వుంటుంది. గర్భాలయంలో సీతారామ లక్ష్మణులతో పాటు భరత .. శత్రుఘ్నులు కూడా కొలువై వుండటం ఇక్కడి ప్రత్యేకతగా చెబుతుంటారు. సోమ .. మంగళ .. శనివారాల్లో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా వుంటుంది. ఇక్కడి ఆలయాన్ని దర్శించడం వలన ఆర్ధికపరమైన కష్టాల నుంచి బయటపడి ఆనందకరమైన జీవితం లభిస్తుందని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.