ఉత్తరాయణ పుణ్యకాలం విశిష్టత
సంక్రాంతి రోజున మకరరాశిలోకి ప్రవేశించిన సూర్యుడు, కర్కాటక రాశిలోకి ప్రవేశించే వరకూ గల కాలాన్ని 'ఉత్తరాయణం' గా చెబుతుంటారు. అలాగే కర్కాటక రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు తిరిగి మకరరాశిలోకి ప్రవేశించే వరకూ గల కాలాన్ని'దక్షిణాయణం' గా చెబుతుంటారు. దక్షిణాయణం కంటే ఉత్తరాయణం ఎంతో విశిష్టమైనదని అంటారు.
దేవతల దృష్టిలో ఉత్తరాయణ కాలం 'పగలు' గా ... దక్షిణాయణ కాలం 'రాత్రి' గా కొనసాగుతుంది. ఈ కారణంగానే దీనిని ఉత్తరాయణ పుణ్యకాలమని అంటూ వుంటారు. ఈ సమయంలో తలపెట్టిన శుభకార్యాలు, ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా సవ్యంగా పూర్తవుతాయనీ ... మంచి ఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెబుతోంది.
అందువలన దక్షిణాయణం వెళ్లే వరకూ నిరీక్షించి, ఉత్తరాయణ కాలంలో శుభకార్యాలు ప్రారంభిస్తూ వుంటారు. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా అన్నప్రాసనలు .. అక్షరాభ్యాసాలు .. ఉపనయనాలు .. వివాహాలు ... గృహప్రవేశాలు జరుగుతూ వుంటాయి. అంతే కాకుండా దైవ సంబంధమైన యజ్ఞయాగాది కార్యక్రమాలు కూడా ఉత్తరాయణ కాలంలోనే నిర్వహించబడుతుంటాయి.
ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. అందువల్లనే ఈ సమయంలో చనిపోయిన వారు పుణ్యాత్ములనీ, వాళ్లు నేరుగా స్వర్గానికి చేరుకుంటారని చెబుతుంటారు. ఉత్తరాయణ కాలంలో బ్రాహ్మణులకు భోజన సామాగ్రిని సమర్పించడం వలన, పితృదేవతలకి ఉత్తమగతులు కలుగుతాయి. పితృ దేవతలకు తిల తర్పణాలు వదలడం వలన, వాళ్ల అనుగ్రహం లభిస్తుంది.